AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: ఉపాసన పుట్టిన రోజు.. భార్యకు కొత్త పేరు పెట్టిన రామ్ చరణ్.. ఏంటో తెలుసా?

శనివారం (జులై 20)న తన పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది రామ్ చరణ్ సతీమణి. ఈ సందర్బంగా పలువురు సినీ ప్రముఖులతో పాటుగా అభిమానులు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. ఇదిలా ఉంటే ఉపాసన పుట్టిన రోజున ఆమెకు ఒక కొత్త పేరు పెట్టాడు రామ్ చరణ్. ఆ పేరుతోనే పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. ఇద్దరూ కలిసున్న ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన చెర్రీ..

Ram Charan: ఉపాసన పుట్టిన రోజు.. భార్యకు కొత్త పేరు పెట్టిన రామ్ చరణ్.. ఏంటో తెలుసా?
Ram Charan, Upasana
Basha Shek
|

Updated on: Jul 21, 2024 | 11:24 AM

Share

టాలీవుడ్ లో ది మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతుల జోడీ ఒకటి. ఓవైపు గ్లోబల్ స్టార్ గా రామ్ చరణ్ సినిమాలతో బిజీగా ఉంటే.. ఉపాసన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటోంది. ఇక ఈ మధ్యనే క్లింకార కొణిదెల కూడా రావడంతో ఎక్కువగా కూతురి ఆలనాపాలనలోనే బిజీబిజీగా ఉంటోంది ఉపాసన. ఇదిలా ఉంటే శనివారం (జులై 20)న తన పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది రామ్ చరణ్ సతీమణి. ఈ సందర్బంగా పలువురు సినీ ప్రముఖులతో పాటుగా అభిమానులు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. ఇదిలా ఉంటే ఉపాసన పుట్టిన రోజున ఆమెకు ఒక కొత్త పేరు పెట్టాడు రామ్ చరణ్. ఆ పేరుతోనే పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. ఇద్దరూ కలిసున్న ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన చెర్రీ.. .. ‘హ్యాపీ బర్త్ డే కారా మమ్మీ’ అంటూ ఫన్నీగా రాసుకొచ్చాడు. అంటే నేరుగా ఉపాసన అని పిలవకుండా క్లీంకార తల్లి అని ఫన్నీగా ఇలా సంభోదించాడు. దీనికి ఉపాసన కూడా క్యూట్ గా రిప్లై ఇచ్చింది.. ‘థ్యాంక్యూ మిస్టర్ సీ. నీ సెల్ఫీ స్కిల్స్ మాత్రం సూపర్బ్’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఉపాసనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ అనే సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ల్ రాజు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డిసెంబర్ లో గేమ్ ఛేంజర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు చరణ్. అందాల తార జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. పల్లెటూరు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం.

భార్య ఉపాసనతో రామ్ చరణ్..

అనంత్ అంబానీ- రాధిక ల పెళ్లి వేడుకలో రామ్ చరణ్ దంపతులు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?