AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajashekar : గోలీల ఫ్యాక్టరీపై నెలకు మూడు కోట్ల సంపాదన.. అసలు విషయం చెప్పిన హీరో రాజశేఖర్..

రాజశేఖర్ ఇటీవల ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తన రాబోయే చిత్రం బైకర్ తో పాటు తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నటనలో "యాంగ్రీ యంగ్ మ్యాన్" పాత్రలను తాను ఎక్కువగా ఇష్టపడతానని, వాటిని సులభంగా చేయగలనని తెలిపారు. డాన్స్ నెంబర్లలో నటించడం కష్టమని, కానీ కాలక్రమేణా అలవాటు చేసుకున్నానని పేర్కొన్నారు. తనని డాక్టర్ గా , హీరోగా పిలిపించుకోవడం రెండు తనకు సంతృప్తిని ఇస్తాయని, పరిశ్రమలో చాలామందికి డాక్టర్‌గా సేవలు అందించానని చెప్పారు.

Rajashekar : గోలీల ఫ్యాక్టరీపై నెలకు మూడు కోట్ల సంపాదన.. అసలు విషయం చెప్పిన హీరో రాజశేఖర్..
Rajashekar
Rajitha Chanti
|

Updated on: Mar 26, 2026 | 9:48 PM

Share

సినీ నటుడు రాజశేఖర్ ఇటీవల ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తన కెరీర్, రాబోయే చిత్రం బైకర్ తో పాటు వ్యక్తిగత జీవితం గురించి చెప్పారు. నటనలో తన “యాంగ్రీ యంగ్ మ్యాన్” ఇమేజ్‌ను బాగా ఆస్వాదిస్తానని, ఆ తరహా పాత్రలు తనకు సహజంగా వస్తాయని వెల్లడించారు. డాన్స్ సన్నివేశాలు తనకెప్పుడూ కష్టంగానే ఉండేవని, వాటికి అలవాటు పడటానికి చాలా ఏళ్లు పట్టిందని పేర్కొన్నారు. తన సినీ ప్రస్థానంలో అనేక ఐకానిక్ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన రాజశేఖర్, తనను డాక్టర్‌గా లేదా హీరోగా పిలిపించుకోవడం రెండు తనకు గొప్ప సంతృప్తిని ఇస్తాయని అన్నారు. సినీ పరిశ్రమలో చాలామందికి డాక్టర్‌గా సేవలు అందించానని, ఆ విషయంలో మంచి పేరు సంపాదించుకున్నానని గుర్తుచేసుకున్నారు. “గోలీల ఫ్యాక్టరీ” గురించి నెల నెలా మూడు కోట్లు ఆదాయం వస్తుందని ప్రజలు నమ్మడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ మీమ్స్ తనపట్ల ప్రజలకున్న ప్రేమను చూపిస్తాయని సంతోషించారు. తన డ్రైవింగ్ స్టైల్ ను ఇతరులు అనుకరించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Sri Sri: ఆ హీరో నా ప్రతి అక్షరానికి విలువ కట్టి పారితోషికం ఇచ్చారు.. శ్రీశ్రీ కామెంట్స్ వైరల్..

బిజినెస్‌లు పెట్టే ఆలోచన ఉన్నప్పటికీ, నటనపై ఉన్న మక్కువతో ఆ రంగంలోనే కొనసాగుతున్నానని తెలిపారు. విలన్ పాత్రలు చేయడానికి తాను సిద్ధమేనని, అయితే అలాంటి మంచి అవకాశం తనకింకా రాలేదని చెప్పారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో ప్రకాష్ రాజ్ పోషించిన పాత్ర గురించి ప్రస్తావించగా, తన నవ్వుతూ ఉండే స్వభావం కారణంగా ఆ పాత్రకు తాను సరిపోనని భావించి వదులుకున్నట్లు వివరించారు. అయితే, తరువాత ఆ సినిమా చూసినప్పుడు చేయాల్సింది అనిపించిందని పంచుకున్నారు. తనకు ముగ్గురు సెక్యూరిటీ గార్డులు ఉన్నారని, వారిలో జీవిత, తన పిల్లలు కూడా ఉన్నారని సరదాగా వ్యాఖ్యానించారు. నానక్రామ్గూడలోని రామానాయుడు స్టూడియోస్‌లో ఒకసారి జీవిత లేకుండా షూటింగ్‌కి వెళ్ళినప్పుడు, అభిమానులు తనను చుట్టుముట్టారని, అప్పుడే జీవిత తన ప్రధాన సెక్యూరిటీ అని గ్రహించానని చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Monalisa : నన్ను ఎక్కడెక్కడో తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు.. శారీరకంగా వేధించాడు.. మోనాలిసా సంచలన కామెంట్స్..

వాహనాల పట్ల తనకున్న ప్రేమను పంచుకుంటూ, పాత ల్యాంబ్రెట్టా స్కూటర్ “వెయ్యిలో ఒక్కడు” గురించి మురిసిపోయారు. కార్లు మార్చడం, లగ్జరీ వాహనాలు (ల్యాండ్ క్రూజర్, పోర్షే, మెర్సిడెస్ బెంజ్, రేంజ్ రోవర్, డిఫెండర్) కొనడం తనకు ఇష్టమని తెలిపారు. పిల్లల ఇష్టాల మేరకే ఇటీవలే డిఫెండర్ కొన్నానని, డ్రైవింగ్‌లో వారికి సలహాలు ఇస్తుంటానని వివరించారు. గతంలో రష్‌గా డ్రైవ్ చేసేవాడినని, అయితే గత 5-6 ఏళ్ల నుండి వెజిటేరియన్ గా మారినప్పటి నుండి శాంతపడ్డానని, డ్రైవింగ్ వేగం కూడా తగ్గించానని అన్నారు. ప్రాణులను హింసించడం ఇష్టం లేక వెజిటేరియన్‌గా మారినట్లు, తన కుటుంబం కూడా తనను అనుసరించిందని చెప్పారు. బైకర్ చిత్రం కష్టానికి, అచీవ్‌మెంట్‌కు ప్రతీక అని రాజశేఖర్ అభిప్రాయపడ్డారు.

ఎక్కువ మంది చదివినవి : Ram Gopal Varma: ఆ మహా మనిషికి తలవంచి పాదాభివందనం చేస్తా.. ఆయన గొప్ప వ్యక్తి.. రామ్ గోపాల్ వర్మ..

ఎక్కువ మంది చదివినవి : Tollywood: కోటి 40 లక్షలు పెట్టి సినిమా తీశా.. అప్పు తీర్చడానికి 6 ఏళ్లు కప్పులు కడిగాను.. టాలీవుడ్ నటుడు..

Follow Us