Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు రేపటికి వాయిదా వేశారు. గుండె పోటుతో కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కన్నుమూసిన విషయం తెలిసిందే. పునీత్ హఠాన్మరణంతో కన్నడ ఇండస్ట్రీతో పాటు అన్నీ ఇండస్ట్రీలు విషాదంలో మునిగిపోయాయి. శుక్రవారం పునీత్ రాజ్ కుమార్ జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న సమయంలో గుండె పోటు రావడంతో కుప్పకూలిపోయారు. బెంగళూరులో విక్రమ్ హాస్పటల్‌లో చికిత్స పొందుతూ పునీత్ కన్నుమూశారు. బెంగళూరు కంఠీరవ స్డేడియంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు , కుటుంబసభ్యులు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కంఠీరవ స్టేడియంలో తండ్రి సమాధి పక్కనే అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. అయితే పునీత్ రాజ్ కుమార్ కుమార్తె ధృతి. అమెరికా నుంచి బెంగళూరు రావాల్సి ఉంది.
ధృతి అమెరికానుంచి బెంగళూరు చేరుకోవడానికి చాలా సమయం పెట్టె అవకాశం ఉంది. దాంతో పునీత్ అంత్యక్రియలను రేపటికి వాయిదా వేశారు. మరో వైపు పునీత్‌కు నివాళి అర్పించేందుకు క్యూ కట్టింది టాలీవుడ్. బాలకృష్ణ, ఎన్టీఆర్, రానా, ప్రభుదేవా, సీనియర్ నరేశ్, శివాబాలాజ సహా నటినటులు నివాళి అర్పించారు. మెగాస్టార్ చిరంజీవి అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. బెంగళూరు కంఠీరవ స్టేడియం చేరుకున్న బాలకృష్ణ పునీత్‌కు కడసారి నివాళి అర్పించారు. పునీత్ సోదరుడు శివరాజ్‌కుమార్‌ను హత్తుకొని ఓదార్చారు. పునీత్ భౌతిక కాయం దగ్గరకు చేరుకోగానే తల పట్టుకున్నారు బాలయ్య. విధి ఎప్పుడు ఎవరిని తీసుకెళ్తుందో అన్నట్లు తలబాదుకున్నారు. ఒక్క తల్లి కడుపులో పుట్టుకపోయినా అలా కలిసి ప్రయాణం చేశామన్నారు.
Daughter of actor Puneeth Rajkumar has reached Delhi (from US) & will arrive in Bengaluru by 7 pm today. As per our tradition, we don’t perform funeral after sunset. His last rites will be performed at Sree Kanteerava Stadium in Bengaluru tomorrow: Karnataka CM Basavaraj Bommai pic.twitter.com/RrFEJyYv4Q
— ANI (@ANI) October 30, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :