Posani Krishna Murali: “జగన్ పై నిందలు వేసినవారు భూమిలోకి పాతుకుపోతారు”.. పోసాని సంచలన కామెంట్స్

సినీ నటుడు పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali) శుక్రవారం తాడేపల్లిలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసారు. మా కుటుంబం కరోనాతో భాదపడుతున్న

Posani Krishna Murali: జగన్ పై నిందలు వేసినవారు భూమిలోకి పాతుకుపోతారు.. పోసాని సంచలన కామెంట్స్
Posani

Updated on: Feb 25, 2022 | 6:00 PM

సినీ నటుడు పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali) శుక్రవారం తాడేపల్లిలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసారు. మా కుటుంబం కరోనాతో భాదపడుతున్న సమయంలో సీఎం.. ఆయన సతీమణి ఏఐజీ ఆసుపత్రికి ఫోన్ చేసి మెరుగైన చికిత్స అందేలా సహకరించారని.. అందుకే ఇప్పుడు సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపినట్లు పోసాని తెలిపారు.

ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ.. “సినిమా టికెట్లపై చిన్న సినిమాల నుంటి ప్రతిపాద‌న‌లు అంద‌కే టికెట్ల ధ‌ర‌ల‌పై నిర్ణయం వ‌స్తుంది. ఈరోజు సినిమా టికెట్ల ధ‌ర‌పై సిఎంతో చ‌ర్చించ‌లేదు. ఆలీకి ఇచ్చిన‌ట్టే త‌న‌కు ప‌ద‌వి ఇస్తున్నారు అనడంలో వాస్త‌వం లేదు. ఇస్తే చెప్పుకోవ‌డానికి నాకేంటి సిగ్గు. భీమ్లానాయ‌క్ సినిమా టికెట్ల గురించి నాకు తెలియ‌దు. నేను సినిమా వాడినే గానీ దాని గురించి నాకు తెలియదు. భీమ్లానాయ‌క్ సినిమాను ఉద్దేశ పూర్వకంగా ఇబ్బంది పెట్టార‌ని మీ ద‌గ్గర సాక్ష్యం ఉంటే చెప్పండి నాద‌గ్గర లేదు. మేము సినిమాలోనే హీరోలం రియల్ హీరో వైఎస్ జగన్. ఆయన మీద నింద‌లు వేసిన వారు భూమిలో 100 అడుగుల‌లోతుకు పాతుకుపోతారు” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Also Read: Bheemla Nayak Review: స‌మ్మర్ సినిమాల‌కు శుభారంభం.. భీమ్లా నాయ‌క్‌.. పర్‌ఫెక్ట్‌ మూవీ రివ్యూ..

Ram gopal Varma: ‘భీమ్లా నాయక్‌ ఒక భూకంపం.. హిందీలో విడుదల చేయాల్సిందే’.. ఆర్జీవీ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్..

Bheemla Nayak: భీమ్లా నాయక్‌ సినిమాపై స్పందించిన చంద్రబాబు, లోకేష్‌.. ఏమన్నారంటే..

Viral Photo: ఇతడి డైలాగ్ గర్జనలా ఉంటుంది.. ఫైట్ యుద్ధంలా ఉంటుంది.. ఎవరో గుర్తించారా