O Kalyan On MAA: ఈసారి మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ ఎన్నికలు రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. మా అధ్యక్ష పోటీలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ , సీవీఎల్ నరసింహా రావు లతో పాటు తాజా నటుడు ఓ కళ్యాణ్ కూడా ఎన్నికల రేస్ లో ఉన్నారు. దీంతో ఎలక్షన్స్ కు మూడు నెలల ముందే ఒకరిపై ఒకరు మాటలు తూటాలు వదులుతున్నారు. లోకల్ నాన్ లోకల్ తో పాటు.. తెలంగాణ వాదం కూడా ఈ సారి ఎన్నికల్లో వినిపిస్తోంది.
తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఇప్పుడు అంపశయ్య మీద వుంది అంటూ ఓ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశాడు. అసలు మా ఎలక్షన్స్ పై రాజకీయం చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారంటూ మీడియా వేదికగా ప్రశ్నించారు. తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద పెద్ద వాళ్ళు వున్నప్పటికీ ఎందుకు ఇలా తయారైంది.. గత 20 సంవత్సరాల నుంచి అందరూ మా కు బిల్డింగ్ కడతాం అని చెబుతున్నారు.. ఎవరూ కట్టడం లేదు ఎందుకు అని అన్నారు. అసలు మా 1000గజాలు కొనిక్కొలేని స్థితిలో మా వుందా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. మా లో ఎవరైనా సభ్యత్వం తీసుకోవచ్చు.. పోటీ చేయొచ్చు.. ప్రకాష్ రాజ్ పోటీ చెయ్యాలి అనుకున్నప్పుడు కార్య వర్గం పనులు పరిశీలించి ప్యానెల్ ఏర్పాటు చెయ్యాలి.. అంతేకానీ ప్రెస్ మిట్ పెట్టు అల్లరి చెయ్యడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు ఓ కళ్యాణ్.
ప్రస్తుతం ఉన్న మా సంఘం సభ్యుల తీరు ఎవరికి వారు ఏమునా తీరే అన్నట్టు అయ్యింది.. నాగబాబు అంటే నాకు గౌరవం అయన భాధ్యత తీసుకొనే కదా గెలిపించింది.. మరి ఇంత గా పరిస్థితులు దిగజారితే మీరు ఇంట్లో కూర్చొని ఎలా కూర్చుని ఉన్నారు అంటూ మెగా బ్రదర్ పై ప్రశ్నల వర్షం కురిపించాడు. అంతేకాదు అందరూ మనకెందుకు అని ఇంట్లో కూర్చుని ఉన్నారు. జనరల్ బాడీ మీటింగ్ పెట్టినప్పుడు మీరందరూ వచ్చి మాట్లాడి ఏకగ్రీవంగా ఎన్నిక చెయ్యొచ్చు కదా.. చిరంజీవి ,నాగార్జున, వెంకటేష్ అందరూ వచ్చి మాట్లాడి మా సమస్యలను పరిష్కరించండని సూచించారు ఓ కళ్యాణ్.
మూవీ ఆర్టిస్ట్ ఇలా అయినందుకు నా బాధ.. ఇండస్ట్రీలోని నలుగురు టాప్ హీరోలు కలిసి ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా అయ్యేటట్లు చూడాలని కోరారు. అంతేకాదు మా భవనం కోసం నేను నా స్థాయిని మించి సహాయం చేస్తాను, నా ఆస్తి అమ్మి కోటిన్నర మా బిల్డింగ్ కోసం ఇస్తాను. మా అల్లరి కాకుండా చూడాల్సిన బాధ్యత ఆ నలుగురు హీరోల దే అన్నారు.. ఈ సందర్భంగా సినీ పరిశ్రమలోని వారు ఆపద సమయంలో సాయం చేయాలంటే అమెరికా వెళ్లాల్సిన అవసరం లేదని.. కర్నూలు వరదలు సమయంలో టీవీ9 సహకారంతో సినిమా పరిశ్రమహైదరాబాద్ లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమo ద్వారా దాదాపు 7కోట్ల రూపాయలు వసూలు చేసి ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు.. కోటి రూపాయల కోసం అమెరికా వెళ్లాలా? అంటూ ప్రశ్నించారు.
Also Read: సినీ ప్రేమికులకు గుడ్ న్యూస్.. రెండు పాటలు మినహా ఆర్ఆర్ఆర్ పూర్తి.. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటన
సింపుల్ అండ్ టేస్టీ గా అరటికాయ హల్వా తయారీ విధానం ..