వర్సటైల్ హీరో నితిన్, కృతి శెట్టి జంటగా నటిస్తోన్న చిత్రం మాచర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam). పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి డైరెక్టర్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ‘మాచర్ల నియోజకవర్గం’ లోని స్పెషల్ సాంగ్ భారీ హైప్ క్రియేట్ చేసింది. మొదట ఈ పాటలోని అంజలి లుక్‌ని విడుదల చేశారు. తర్వాత అదిరిపోయే ప్రోమోని విడుదల చేశారు. స్టార్ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిధిగా హైదరాబద్ లో గ్రాండ్ గా జరిగిన మాస్ మ్యూజిక్ జాతర ఈవెంట్ లో మాస్ డ్యాన్స్ నంబర్ ”రా రా రెడ్డి” లిరికల్ వీడియోను విడుదల చేశారు.
సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్. నితిన్ ఎనర్జీ, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సిగ్నేచర్ డ్యాన్స్ స్టెప్పులు, అంజలి గ్లామర్ ఈ పాటని ఇన్స్టెంట్ హిట్ గా నిలిపాయి. కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం మాస్ ని మురిపిస్తుంది. నితిన్, అంజలి మాస్ డ్యాన్స్ స్టెప్స్ ఫ్యాన్స్ ని అలరిస్తున్నాయి. నితిన్ తొలి చిత్రం ‘జయం’ లోని రాను రాను అంటూనే చిన్నదో పాట పల్లవిని ఈ పాటలో చేర్చడం మరింత స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
నితిన్ మాట్లాడుతూ.. అభిమానులు ఎప్పుడూ డ్యాన్స్ సాంగ్స్ చేయమని అడుగుతుంటారు. వారి కోసమే ఈ చిత్రంలో హెవీ డ్యాన్స్ నెంబర్స్ పెట్టాం. లిరికల్ వీడియోలో వున్నది సాంపిల్ మాత్రమే ఈ సినిమాలో పాట అదిరిపోతుంది. జానీ మాస్టర్ తో చేసిన ప్రతి పాట సూపర్ హిట్, ఈ పాట కూడా సూపర్ హిట్ అయ్యింది. సాగర్ అద్భుతమైన ట్యూన్ చేశారు. కాసర్ల శ్యామ్ చాలా మాస్ గా రాశారు. దర్శకుడు రాజ శేఖర్ రెడ్డి సినిమా అద్భుతంగా తీశారు. దిల్ రాజు గారు ఈ పాటని రిలీజ్ చేయడం ఆనందం. ఈ పాటలో జయంలో రానురాను పాట రిపీట్ చేయడం చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఈ పాటని షూట్ చేస్తున్నపుడు ఇరవై ఏళ్ల క్రితం ఎంత ఎనర్జీ వుండిదో అదే ఎనర్జీ తో ఈ పాటని చేశాను. నన్ను లాంచ్ చేసిన తేజ గారికి, ఆ పాటని ఇచ్చిన ఆర్పీ పట్నాయక్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు. అంజలి అద్భుతమైన నటి. ఈ పాట చేస్తున్నపుడు ఆమెకు మోకాలికి గాయం వున్నప్పటికీ ఫ్లోర్ మూమెంట్స్ అన్నీ చాలా హార్డ్ వర్క్ చేసిన అద్భుతమైన డ్యాన్స్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. కృతితో నా మొదటి సినిమా. ఈ సాంగ్ లో కూడా కృతి సర్ ప్రైజ్ వుంటుంది. ఆగస్ట్ 12 న సినిమా వస్తుంది.దానికి ముందు మరిన్ని ఈవెంట్స్ తో కలుద్దాం” అని చెప్పారు.