
ఇటీవలే దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు న్యాచురల్ స్టార్ నాని. మార్చి 30న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ 100 కోట్లకు పైగానే వసూల్లు రాబట్టింది. ఈ సినిమా హిట్ తో మంచి ఊపు మీద ఉన్న నాని.. ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టారు. వైరా క్రియేషన్స్ బ్యానర్ పై డైరెక్టర్ శౌర్యువ్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తోంది. అయితే ఈ సినిమాకు సంబందించిన ఎలాంటి అప్డేట్స్ షేర్ చేయని చిత్రయూనిట్.. ఆకస్మాత్తుగా రిలీజ్ డేట్ లాక్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు. దసరాతో సమ్మర్ సూపర్ స్టార్ట్ ఇచ్చిన నాని.. ఇక తన నెక్ట్స్ ప్రాజెక్టును ఈ ఏడాది చివర్లో అంటే డిసెంబర్ 21న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.
క్రిస్మస్ కానుకగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈ సినిమాలో నాని మరోసారి తండ్రి పాత్రలో కనిపించనున్నారు. గతంలో జెర్సీ సినిమాలోనూ ఫాదర్ రోల్ లో మెప్పించారు. తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు కొత్త కథలను అందిస్తూ తన నటనతో మెప్పిస్తున్నారు నాని. ఇటీవల దసరాతో భారీ విజయాన్ని అందుకున్న నాని.. తన తరువాతి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్.. టైటిల్ ఇలాంటి అప్డేట్స్ ఏం లేకుండానే నేరుగా రిలీజ్ డేట్ ప్రకటించేశారు మేకర్స్.
ఇక ఈ సినిమా కథేంటీ.. ఎలా ఉండబోతుంది అనే వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు. నాని సినిమాతోపాటు.. ఈ ఏడాది చివర్లో మరిన్ని ప్రాజెక్ట్స్ ఆడియన్స్ ముందుకు రావడం ఖాయంగా తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.