Actor Nani: నాని , అంజన ప్రేమ, పెళ్లి.. 11 సంవత్సరాల ప్రయాణం.. అందమైన ఫోటో షేర్ చేసిన న్యాచురల్ స్టార్..
బాపు, శ్రీను వైట్ల దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన నాని.. అష్టా చెమ్మా సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు. డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ఈ సినిమాలో నాని నటన ఆకట్టుకుంది. దీంతో హీరోగా నానికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ మూవీ తర్వాత ఆయన వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. వరుస సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్థానం ఏర్పర్చుకున్నారు. అష్టాచెమ్మా తర్వాత అలా మొదలైంది..

తెలుగు సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా హీరోగా అడుగుపెట్టి ఇప్పుడు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న హీరో న్యాచులర్ స్టార్ నాని. కెరీర్ మొదట్లో అస్టిస్టెంట్ డైరెక్టర్ గా.. రేడియా జాకీగా వర్క్ చేసిన నాని.. ఆ తర్వాత హీరోగా మారారు. బాపు, శ్రీను వైట్ల దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన నాని.. అష్టా చెమ్మా సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు. డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ఈ సినిమాలో నాని నటన ఆకట్టుకుంది. దీంతో హీరోగా నానికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ మూవీ తర్వాత ఆయన వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. వరుస సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్థానం ఏర్పర్చుకున్నారు. అష్టాచెమ్మా తర్వాత అలా మొదలైంది.. భీమిలి కబడ్డీ జట్టు సినిమాల్లో నటించారు. నటుడిగా సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు నాని.
ఈగ, జెర్సీ, భలే భలే మగాడివోయ్, ఎంసీఏ, శ్యామ్ సింగరాయ్, నేను లోకల్ వంటి చిత్రాలు నానికి మరింత గుర్తింపు తీసుకువచ్చాయి. ఇటీవలే దసరా సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయం అందుకున్నాడు. ఈ సినిమాలో పక్కా ఊర మాస్ పాత్రలో మెప్పించారు. ఇక ప్రస్తుతం హాయ్ నాన్న సినిమాలో నటిస్తోన్నారు నాని. ఇందులో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. మరోవైపు తన కొత్త సినిమా సరిపోదా శనివారం సినిమాను ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. తాజాగా నాని తన ఇన్ స్టాలో ఓ అందమైన ఫోటో షేర్ చేసుకున్నారు.
View this post on Instagram
నాని, అంజన వివాహం జరిగి నిన్నటికి 11 సంవత్సరాలు. 2012లో అక్టోబర్ 27న తన స్నేహితురాలు అంజనా ఎలవర్తి వివాహం చేసుకున్నారు. వీరికి ఓ బాబు ఉన్నాడు. వీరిద్దరి పెళ్లి జరిగి 11 ఏళ్లు పూర్తైనందున తన భార్యతో ఉన్న అందమైన ఫోటో పంచుకున్నారు. తన భార్య అంజనకు బొట్టు పెడుతున్న పిక్ పంచుకున్నారు. మా బంధానికి 11 సంవత్సరాలు అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇది చూసిన నెటిజన్స్ నానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నాని, అంజనా ఐదేళ్లు ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. ఆ తర్వాత ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఒక్కటయ్యారు.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




