
దసరా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు న్యాచురల్ స్టార్ నాని. తొలి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేశారు డైరెక్టర్ శ్రీకాంత్ ఒదెల. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వచ్చిన ఈ రా అండ్ విలేజ్ యాక్షన్ డ్రామాలో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. మార్చి 30న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ భారీగా వసూళ్లు రాబడుతూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. మరోవైపు ఈ సినిమా సాంగ్స్ యూట్యూబ్లో మంచి రెస్పాన్స్ వస్తుండగా.. ఇటీవల విడుదలైన డిలిటెడ్ సీన్ సైతం ఆకట్టుకుంటుంది. వెన్నెల ఆవేదన అంటూ రిలీజ్ అయిన ఆ వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ క్రేజీ వీడియో షేర్ చేశాడు హీరో నాని..
దసరా సెట్లో ఎంతో సరదాగా చిత్రబృందంతో కలిసి నాని క్రికెట్ ఆడుతున్నారు. వీరితోపాటు.. మరో నటుడు దీక్షిత్ శెట్టి సైతం ఈ వీడియోలో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. టీజర్ కట్ లో ఉన్న ఈ సీన్ సినిమాలో లేదు.. ఇదే వీడియోను నాని పోస్ట్ చేయగా.. అభిమానుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సీన్ మూవీలో ఉండి ఉంటే ఇంకా బాగుండేదంటున్నారు ఫ్యాన్స్. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందంచారు.
నాని ట్వీట్..
Team #Dasara pic.twitter.com/qo2MtjvIv5
— Nani (@NameisNani) April 11, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.