Allu Arjun Arrest: ‘ఒక్కరినే బాధ్యుడిని చేస్తారా? అల్లు అర్జున్‌కు అండగా న్యాచురల్ స్టార్ నాని

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున ను అరెస్టు చేయడంపై పలువురు సినీ నటులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. తాజాగా ఇదే విషయమై న్యాచురల్ స్టార్ నాని సంచలన ట్వీట్ చేశారు.

Allu Arjun Arrest: ఒక్కరినే బాధ్యుడిని చేస్తారా? అల్లు అర్జున్‌కు అండగా న్యాచురల్ స్టార్ నాని
Allu Arjun, Nani

Updated on: Dec 13, 2024 | 6:30 PM

అల్లు అర్జున్ అరెస్టుపై న్యాచురల్ స్టార్ నాని ఘాటుగా స్పందించారు. ఇలాంటి కేసుల్లో ఒక్కరినే బాధ్యుడిని చేస్తారా? అంటూ ట్విట్టర్ వేదికగా మండి పడ్డాడు. గవర్నమెంట్ అథారిటీస్, పోలీసులు.. మీడియా షో, సినిమా వాళ్లపై చూపించే బాధ్యత కామన్ సిటిజన్స్ పై కూడా చూపిస్తే బాగుంటుంది. మనం మంచి సమాజంలో బతుకుతున్నాం. ఇలాంటి ఘటన జరగడం నిజంగా బాధాకరం. ఇది ఒక ఉదాహరణగా తీసుకొని ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాలి.. ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూడాలి . ఇక్కడ తప్పు మన అందరిదీ ఉంది. ఒక్కరి మీద నెట్టడం సమంజసం కాదు’ అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు నాని.

అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

‘సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన ఏదైతే ఉందో అది బాధాకరం. ఇంకా బెటర్ సేఫ్టీ ప్రోటోకాల్స్ తీసుకుని ఉండుంటే బాగుండేది. ఈ ఘటనకు అల్లు అర్జున్ ను బాధ్యులను చేయడం దారుణం. తన పరిధిలో లేని విషయాన్ని అల్లు అర్జున్ గారికి రిలేట్ చేయడం అకారణంగా అనిపిస్తుంది. బాధిత కుటుంబానికి అండగా నిలబడతానని ఇప్పటికే అల్లు అర్జున్ హామీ ఇచ్చారు. బ్లేమ్ గేమ్ తో దాన్ని కనపడనీయకుండా చేయకండి. న్యాయం జరగాలి.. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి’ అని ట్వీట్ చేశారు అనిల్ రావి పూడి..

ఇవి కూడా చదవండి

న్యాచురల్ స్టార్ నాని ట్వీట్..

అనిల్ రావిపూడి ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.