AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Nani: ‘నాకు ఓ కూతురు ఉంటే బాగుండనిపిస్తుంది’.. నాని ఆసక్తికర కామెంట్స్..

హాయ్ నాన్న సినిమాలో అమ్మాయికి తండ్రిగా నటించడంతో తనకు కూతురు కావాలని ఉందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నాని చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. 'ఇంతకు ముందు తండ్రి పాత్రలలో నటించాను. కానీ హాయ్ నాన్న సినిమాలో ఓ అమ్మాయికి తండ్రిగా నటించడం కొత్త అనుభూతినిచ్చింది. నాకు మొదటి నుంచి ఆడపిల్లలంటే ఇష్టం. ఈ సినిమాలో నటించడం మొదలు పెట్టాక కూతురుతో ఎలా ఉండాలో అనుభవం వచ్చింది. అందుకే నాకు ఓ కూతురుంటే బాగుండనిపిస్తోంది' అని అన్నారు.

Actor Nani: 'నాకు ఓ కూతురు ఉంటే బాగుండనిపిస్తుంది'.. నాని ఆసక్తికర కామెంట్స్..
Nani
Rajitha Chanti
|

Updated on: Nov 09, 2023 | 2:18 PM

Share

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం హాయ్ నాన్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా బుధవారం ప్రముఖ ఆంగ్ల మీడియా ఇండియా టూడే నిర్వహించిన తెలంగాణ రౌండ్‌టేబుల్ 2023 సమావేశానికి అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాని మాట్లాడుతూ.. తన సినిమా అప్డేట్స్ గురించి మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాల గురించి స్పందించారు. ఈ క్రమంలో తనకు ఒక్క కూతురు ఉంటే బాగుండు అనిపిస్తుందని.. హాయ్ నాన్న సినిమాలో అమ్మాయికి తండ్రిగా నటించడంతో తనకు కూతురు కావాలని ఉందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నాని చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ‘ఇంతకు ముందు తండ్రి పాత్రలలో నటించాను. కానీ హాయ్ నాన్న సినిమాలో ఓ అమ్మాయికి తండ్రిగా నటించడం కొత్త అనుభూతినిచ్చింది. నాకు మొదటి నుంచి ఆడపిల్లలంటే ఇష్టం. ఈ సినిమాలో నటించడం మొదలు పెట్టాక కూతురుతో ఎలా ఉండాలో అనుభవం వచ్చింది. అందుకే నాకు ఓ కూతురుంటే బాగుండనిపిస్తోంది’ అని అన్నారు.

డైరెక్టర్ శౌర్యువ్ రచన, దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ డిసెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో నాని, మృణాల్ ఠాకూర్‌తో, నాని కుతురిగా కియారా ఖన్నా నటిస్తోంది. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు ముందు నాని జెర్సీ సినిమాలో తండ్రి పాత్రలో నటించాడు.

View this post on Instagram

A post shared by Nani (@nameisnani)

ఇక ఇదే సమావేశంలో నానీ జై భీమ్ ట్వీట్ వివాదంపై స్పందించారు. తను చేసిన ట్వీట్ గురించి తప్పుగా రాశారని.. తెలుగు సినిమాలకు అవార్డ్స్ రావడం పై తాను సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. అలాగే జైభీమ్ సినిమాకు వచ్చి ఉంటే మరింత సంతోషంగా ఉండేదని.. అలాంటి సినిమాలు చూసేవారికి అవార్డ్ రావడం మరింత ఉత్సాహంగా ఉంటుందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు నాని.

View this post on Instagram

A post shared by Nani (@nameisnani)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us