HIT 3 First Day Collections: రప్పా.. రప్పా.. బాక్సాఫీస్‏ను రఫ్పాడించాడుగా.. నాని హిట్ 3 ఫస్ట్ డే వసూళ్లు ఎంతంటే..

న్యాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో అలరిస్తున్న సంగతి తెలిసిందే. హిట్టు, ప్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. తాజాగా హిట్ 3 సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా మేడే సందర్భంగా థియేటర్లలో విడుదలైంది.

HIT 3 First Day Collections: రప్పా.. రప్పా.. బాక్సాఫీస్‏ను రఫ్పాడించాడుగా.. నాని హిట్ 3 ఫస్ట్ డే వసూళ్లు ఎంతంటే..
Hit 3

Updated on: May 02, 2025 | 12:33 PM

హాయ్ నాన్న హిట్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటేస్ట్ మూవీ హిట్ 3. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మేడే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మొదటి రోజే పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. ఇందులో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించారు. ఇప్పటివరకు పక్కింటి అబ్బాయిగా తెరపై సందడి చేసిన నాని.. ఈ మూవీలో మాత్రం ఊహించని ఊర మాస్ వయోలెన్స్‏తో వణుకుపుట్టించేశాడని.. మాస్ హీరోగా మరోసారి సత్తా చాటాడని ప్రశంసలు కురిపించారు విమర్శకులు. ఈ సినిమాకు నిన్నటి నుంచి పాటిటివ్ టాక్ వస్తుంది. ఇక తాజాగా హిట్ 3 మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ రివీల్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.43 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

నాని కెరీర్ లోనే తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో చిత్రంగా హిట్ 3 నిలిచింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగానే కాకుండా ఓవర్సీస్ లోనూ ఈ మూవీ దూసుకుపోతుంది. ప్రీ బుకింగ్స్ లోనే హవా చూపించిన ఈ సినిమా విడుదల తర్వాత కూడా అదే జోష్ కొనసాగుతుంది. ఓవర్సీస్ లో తొలిరోజే వన్ మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరింది. ఈ వారంతంలోనే రెండు మిలియన్ డాలర్లు వసూలు చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. హిట్ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన ఈ సినిమాలో అర్జున్ సర్కార్ పాత్రలో రఫ్పాడించారు నాని.

ఈ సినిమా ఇప్పటికే రికార్డ్స్ సృష్టిస్తోంది. ఆన్ లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ బుక్ మై షోలో హిట్ ది థర్డ్ కేసు సినిమా 24 గంటల్లో 2.72 లక్షలు టికెట్స్ అమ్ముడైనట్లు సమాచారం. నాని కెరీర్ లో ఒక్కరోజే ఇన్ని టికెట్స్ సేల్ కావడం ఇదే మొదటిసారి. ఈ చిత్రంలో నాని సరసన కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించింది.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..