Actor Nandu: 800 మంది ఆకలి తీర్చిన నటుడు నందు.. స్వయంగా వండి, వడ్డించి.. వీడియో చూస్తే హ్యాట్సాఫ్‌ అనాల్సిందే

మరోసారి తండ్రి కానున్నాడనో వేళా విశేషమో, లేక మరేదైనా సందర్భమో ఒక మంచి పని చేసి అందరి మనసులు గెల్చుకున్నాడు నందు. అన్నదానం చేసి ఏకంగా 800 మంది ఆకలి తీర్చాడు. శ్రీ విద్యాపీఠంలో అన్నపూర్ణార్చన చేసిన నందు.. 800 మందికి ఆహారాన్ని అందించారు

Actor Nandu: 800 మంది ఆకలి తీర్చిన నటుడు నందు.. స్వయంగా వండి, వడ్డించి.. వీడియో చూస్తే హ్యాట్సాఫ్‌ అనాల్సిందే
Actor Nandu

Updated on: Feb 14, 2024 | 6:46 AM

ఓ వైపు బుల్లితెరపై స్టార్‌ యాంకర్‌గ రాణిస్తూనే మరోవైపు సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో బిజిబిజీగా ఉంటున్నాడు నందు. అంతేకాదు ఐపీఎల్‌ లాంటి ధనాధన్ క్రికెట్‌ టోర్నమెంట్లలో స్పోర్ట్స్‌ యాంకర్‌గానూ తన ట్యాలెంట్‌ చూపిస్తున్నాడు. సుమారు 25కు పైగా సినిమాల్లో నటించి ట్యాలెంటెడ్‌ నటుడిగా ప్రూవ్‌ చేసుకున్నాడు నందు. ఇటీవల అతను నటించిన మ్యాన్షన్ 23, వధువు వెబ్‌ సిరీస్ లకు ఓటీటీల్లో మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇక వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. త్వరలో మరోసారి తండ్రిగా ప్రమోషన్‌ పొందనున్నాడు నందు. అతని భార్య ప్రముఖ సింగర్‌ గీతా మాధురి త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఇటీవలే కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో గీతా మాధురి సీమంతం వేడుకగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మరోసారి తండ్రి కానున్నాడనో వేళా విశేషమో, లేక మరేదైనా సందర్భమో ఒక మంచి పని చేసి అందరి మనసులు గెల్చుకున్నాడు నందు. అన్నదానం చేసి ఏకంగా 800 మంది ఆకలి తీర్చాడు. శ్రీ విద్యాపీఠంలో అన్నపూర్ణార్చన చేసిన నందు.. 800 మందికి ఆహారాన్ని అందించారు. తానే స్వయంగా ఫుడ్‌ ప్రిపేర్‌ చేశాడు. అందరికీ వడ్డించాడు. అన్నదానం తర్వాత కూడా పాత్రలు కూడా కడిగాడు. యాక్టర్‌ అన్న ట్యాగ్‌ ను పక్కన పెట్టి ప్రతి పనిలోనూ చేయి అందించాడు.

అన్నదానానికి సంబంధించిన వీడియోను తన సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేశాడు నందు. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్‌గా మారింది. నందు మంచి తనం, అలాగే అతని సింప్లిసిటీని చూసి పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చాలా గొప్ప పని చేశావంటూ నందూపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 2014లో సింగర్ గీతా మాధురిని ప్రేమ వివాహం చేసుకున్నాడు నందు. 2019లో వీరికి దాక్షాయణి ప్రకృతి అనే కూతురు పుట్టింది. ఇప్పుడు మరోసారి అమ్మానాన్నలుగా ప్రమోషన్‌ పొందనున్నారు.

ఇవి కూడా చదవండి

అన్నదాన కార్యక్రమంలో నటుడు నందు.. వీడియో..

నందు భార్య గీతా మాధురి సీమంతం… వీడియో

డ్రగ్ కేసులో తన పేరు రావడంపై ఎమోషనలైన నందు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.