Balakrishna : నట సింహం నందమూరి బాలకృష్ణ సినిమా వస్తుందటే అభిమానుల్లో జోష్ మాములుగా ఉండదు. ఇక రీసెంట్ గా అఖండ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు బాలయ్య. కరోనా కల్లోలం తర్వాత తెలుగు సినిమాకు మరో భారీ విజయాన్ని అందించారు బాలయ్య. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా గతంలో ఈ కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలను మించి విజయాన్ని సాధించింది. ఇక అఖండ మూవీ కలెక్షన్స్ సునామి సృష్టించింది. రిలీజ్ అయ్యి ఇన్ని రోజులవుతున్న అఖండ సినిమా కోసం థియేటర్స్ దగ్గర క్యూ కడుతున్నారు ప్రేక్షకులు. ఇక ఈ సినిమా త్వరలోనే ఓటీటీ వేదికగా విడుదల కానుంది. ఇక సినిమాలతోనే కాదు హోస్ట్ గాను అలరిస్తున్నారు బాలయ్య.
”అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే షో” బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో బాలకృష్ణ షో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ షో టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. ఇప్పుడు బాలకృష్ణ క్రేజ్ ఈ షో కారణంగా మరింత పెరిగిందనే చెప్పాలి. దాంతో బాలయ్య రెమ్యునరేషన్ కూడా పెరిగిందని టాక్. తాజాగా ఆయన సాధించిన అఖండ విజయంతో ఆయన రెమ్యునరేషన్ లో మార్పు వచ్చేసిందని చెబుతున్నారు. అఖండకు రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా చెప్తున్నారు. ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం 12 నుంచి 15 కోట్ల వరకు తీసుకోనున్నారని తెలుస్తుంది. బాలకృష్ణ క్రేజ్‌ను సొంతం చేసుకోవడానికి ఆ మాత్రం రెమ్యునరేషన్ ఇవ్వడానికి చిత్ర యూనిట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు బాలయ్య. అలాగే పూరి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నాడు . త్వరలోనే ఈ సినిమాలు పట్టాలెక్కనున్నాయి.
మరిన్నిఇక్కడ చదవండి :