AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Naga Shaurya: కలలో కూడా ఎవరికీ హానీ చేయడు.. దర్శన్‏కు హీరో నాగశౌర్య సపోర్ట్.. పోస్ట్ వైరల్..

చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి దారుణంగా చిత్రహింసలకు గురిచేసి చంపి మురికి కాలువులో పడేశారని.. అతడికి కరెంట్ షాక్ ఇచ్చి ప్రైవేట్ పార్ట్స్ పై దర్శన్ తన్నడంతోనే చనిపోయాడని పోలీసుల విచారణలో బయటపడింది. దీంతో దర్శన్ తోపాటు పవిత్రగౌడపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని.. వారికి శిక్ష పడాలంటూ కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా రేణుకాస్వామికి మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే దర్శన్ తీరుపై పలువురు సినీ ప్రముఖులు షాకింగ్ కామెంట్స్ చేశారు.

Actor Naga Shaurya: కలలో కూడా ఎవరికీ హానీ చేయడు.. దర్శన్‏కు హీరో నాగశౌర్య సపోర్ట్.. పోస్ట్ వైరల్..
Naga Shaurya
Rajitha Chanti
|

Updated on: Jun 28, 2024 | 10:41 AM

Share

కన్నడ సినీ పరిశ్రమలో రేణుకాస్వామి హత్య సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో హీరో దర్శన్.. అతడి ప్రియురాలు నటి పవిత్ర గౌడతోపాటు మరో పదిహేడు మందిని అరెస్ట్ చేశారు బెంగుళూరు పోలీసులు. పవిత్రగౌడకు సోషల్ మీడియాలో అసభ్యకరంగా మెసేజ్ లు పంపించాడనే కోపంతో దర్శన్ అతడి అభిమానులతో కలిసి రేణుకాస్వామిని దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి దారుణంగా చిత్రహింసలకు గురిచేసి చంపి మురికి కాలువులో పడేశారని.. అతడికి కరెంట్ షాక్ ఇచ్చి ప్రైవేట్ పార్ట్స్ పై దర్శన్ తన్నడంతోనే చనిపోయాడని పోలీసుల విచారణలో బయటపడింది. దీంతో దర్శన్ తోపాటు పవిత్రగౌడపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని.. వారికి శిక్ష పడాలంటూ కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా రేణుకాస్వామికి మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే దర్శన్ తీరుపై పలువురు సినీ ప్రముఖులు షాకింగ్ కామెంట్స్ చేశారు. సినిమా షూటింగ్ సెట్స్ లో ఇతర నటీనటులతో దర్శన్ ప్రవర్తన గురించి అనేక విషయాలు బయటకు వచ్చాయి.

ఈ కేసులో దర్శన్ కు శిక్ష పడాలంటూ పలువురు నటీనటులు చెప్పగా.. మరికొందరు మాత్రం అతడికి మద్దతు తెలుపుతున్నారు. రేణుకాస్వామి మర్డర్ తోపాటు గతంలో దర్శన్ చేసిన అనేక వివాదాలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. దీంతో రోజు రోజుకు ఈ కేసులో దర్శన్ కు మరింత ఊచ్చు బిగుస్తుంది. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ హీరో నాగశౌర్య దర్శన్ కు సపోర్ట్ చేస్తూ పోస్ట్ చేశాడు. ఈ కేసు నుంచి దర్శన్ నిర్దోషిగా బయటపడతాడనే నమ్మకం తనకు ఉందని.. దర్శన్ చాలా మంచివాడంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. అలాగే దర్శన్ తో కలిసి దిగిన ఓ ఫోటోను షేర్ చేశారు.

“మరణించిన వ్యక్తి కుటుంబం గురించి వింటే నా గుండె తరుక్కుపోతుంది. ఈ కష్ట సమయంలో వారికి బలం చేకూరాలని కోరుకుంటున్నాను. దర్శన్ అన్న కలలో కూడా ఎవరికీ హానీ తలపెట్టడు. అతడి మంచితనంతో ఎంతో మందికి సాయం చేశాడు. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. న్యాయవ్యవస్థపై నాకు నమ్మకముంది. త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయి. దర్శన్ పై వస్తున్న ఆరోపణల్లో నిజాలు ఏంటీ అనేది బయటకు రాకముందే అతడిపై విమర్శలు చేయడం ఓ నిర్ణయానికి రావడం సరైనది కాదు. దర్శన్ నిర్దోషిగా బయటకు వస్తాడనే నమ్మకం ఉంది. నిజమైన దోషులు చట్టం ముందుకు తప్పకుండా వస్తారు. ఈ అసత్య ఆరోపణల వల్ల దర్శన్ ఫ్యామిలీకి ఎంతో ఆవేదన, భాద కలుగుతుంది. ఈ కఠిన పరిస్థితుల్లో వారి ప్రైవసీకి భంగం కలిగించవద్దు ” అంటూ సుధీర్ఘ నోట్ రాసుకోచ్చాడు. ప్రస్తుతం నాగశౌర్య చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

View this post on Instagram

A post shared by Naga Shaurya (@actorshaurya)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.