Mohan Babu: ‘నా మౌనం చేతకానితనం కాదు’.. మోహన్ బాబు సంచలన లేఖ

సినిమా టిక్కెట్ల ఇష్యూలోకి పెదరాయుడు ఎంట్రీ ఇచ్చారు. టీవీ9 ముందుగా చెప్పినట్లే డైలాగ్‌ కింగ్‌ మోహన్‌బాబు ఇండస్ట్రీలో సమస్యల పరిష్కారానికి ముందడుగు వేశారు.

Mohan Babu: నా మౌనం చేతకానితనం కాదు.. మోహన్ బాబు సంచలన లేఖ
Mohan babu

Updated on: Jan 02, 2022 | 7:02 PM

సినిమా టిక్కెట్ల ఇష్యూలోకి పెదరాయుడు ఎంట్రీ ఇచ్చారు. టీవీ9 ముందుగా చెప్పినట్లే డైలాగ్‌ కింగ్‌ మోహన్‌బాబు ఇండస్ట్రీలో సమస్యల పరిష్కారానికి ముందడుగు వేశారు. ఇండస్ట్రీ పెద్దగా తాను ఉండలేనని ఈ ఉదయం మెగాస్టార్‌ చిరంజీవి కామెంట్లు చేసిన కొన్ని గంటల్లోనే మోహన్‌బాబు బహిరంగ ప్రకటన చేశారు. తన మౌనం చేతకానితనం, చేవలేనితనం కాదని ఘాటుగా రియాక్ట్‌ అయ్యారు మోహన్‌బాబు. సినిమా ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్లు,నలుగురు డిస్ట్రిబ్యూటర్లు కాదన్నారు. సినిమా పరిశ్రమలో అందరూ సమానమేనన్నారు. సినీ పరిశ్రమ ఏ ఒక్కరి గుత్తాధిపత్యం కాదని స్పష్టం చేశారు. ప్రస్తుత రేట్ల విధానంతో సినిమాలు నిలబడడం కష్టమని,
చిన్న సినిమాలు ఆడాలి, పెద్ద సినిమాలు ఆడాలని పేర్కొన్నారు. సినిమాలు ఆడాలంటే సరైన ధరలు ఉండాలన్నారు మోహన్‌బాబు. అందరూ కలిసి రావాల్సిన టైం వచ్చిందన్నారు, ముందుకు రండి కలిసి నడుద్దాం అంటూ పిలుపునిచ్చారు.

ఇలాంటి కీలక టైమ్‌లో నిర్మాతలు ఏమయ్యారని ప్రశ్నించారు మోహన్‌బాబు. వాళ్లు ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ఈ ఇష్యూను భుజాల మీద వేసుకోకుండా.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఎందుకు ఉందో కూడా అర్థం కావడం లేదన్నారు మోహన్‌బాబు. రండి ఇద్దరు సీఎంల దగ్గరకు వెళదాం, సమస్యలు చెప్పుకుందాం అంటూ ఓపెన్‌ రిక్వెస్ట్‌ చేశారు.

Also Read: Viral Video: తగ్గేదే లే.. కుక్కను ఎదిరించిన తొండ.. వీడియో చూస్తే పక్కా షాకవుతారు

Viral: ఆకాశం నుంచి చేపల వర్షం… సంభ్రమాశ్చర్యాలకు లోనైన జనం