Manchu Manoj: మంచు మనోజ్ దాతృత్వం.. కరోనా కష్టంలో వారికి అండగా.. పుట్టినరోజు వేళ 25వేల కుటుంబాలకు సాయం..

|

May 20, 2021 | 3:14 PM

మంచు మనోజ్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. కరోనా కష్టకాలంలో బర్త్ డే సెలబ్రేషన్స్ కు

Manchu Manoj: మంచు మనోజ్ దాతృత్వం.. కరోనా కష్టంలో వారికి అండగా.. పుట్టినరోజు వేళ 25వేల కుటుంబాలకు సాయం..
Manchu Manoj
Follow us on

మంచు మనోజ్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. కరోనా కష్టకాలంలో బర్త్ డే సెలబ్రేషన్స్ కు చోటు లేదని మరోసారి తేల్చేశాడు. తన బర్త్ డే సందర్భంగా తనలోని సేవా గుణాన్ని చాటుకున్నారు.. మంచు మనోజ్ ఈరోజు తన వంతుగా కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సాయం చేస్తానని ప్రకటించాడు. మే 20 గురువారం తన పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.

చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ కెరీర్ ను స్టార్ట్ చేసిన మంచు మనోజ్.. ‘దొంగా దొంగది’ మూవీతో హీరోగా స్ర్కీన్ పై కనిపించాడు. మొదటి సినిమాలోనే కామెడీని పంచిన మనోజ్ అందరిచేతా అదుర్స్ అనిపించుకున్నారు. రొటీన్ కమర్షియల్ సినిమాలతోపాటు.. సరికొత్త కథలతో ముందుకొచ్చిన మనోజ్.. క్రిష్ డైరెక్షన్ లో ‘వేదం’ మూవీ చేశాడు. రాక్ స్టార్ గా రోల్ చేసినా.. చివరకు మానవత్వాన్ని గెలిపించే మనిషిగా తన క్యారెక్టర్ ను ప్రజెంట్ చేశారు మనోజ్. ఆ తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దృష్టిలో పడ్డ మనోజ్.. ఝుమ్మంది నాధం మూవీ చేశారు. ఇక ఆ తర్వాత బాలకృష్ణతో ఊ కొడతారా.. ఉలిక్కి పడతారా అంటూ సోషియో ఫాంటసీ మూవీ చేశాడు. ఇటు మంచు ఫ్యామిలీ హీరోలంతా కలిసి చేసిన పాండవులు పాండవులు తుమ్మెద సూపర్ హిట్ సాధించింది. ఇందులో మనోజ్ లేడీ గెటప్ వేసి తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇదిలా ఉంటే.. ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా గొప్ప నిర్ణయం తీసుకున్నారు మనోజ్. కరోనా వల్ల కష్టాలు పడుతున్న 25 వేల కుటుంబాలకు తనవంతుగా నిత్యావసరాలు అందించాడు. అలాగే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తానని కూడా తెలిపారు. కరోనా వారియర్స్ అయిన వైద్యులకు, పోలీసులకు, ఆరోగ్య సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు సెల్యూట్ చెప్పారు. ప్రస్తుతం కరోనా నుంచి తమను తాము కాపాడుకోవడానికి అందరూ మాస్కులు ధరించాలని.. శానిటైజర్లు వాడాలని కోరారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని.. లేదంటే ఇంట్లోనే ఉండాలని.. ప్రతి ఒక్కరు లాక్ డౌన్ రూల్స్ పాటించాలని విజ్ఞప్తి చేశారు మనోజ్..

Also Read: లక్కీ ఛాన్స్ అందుకున్న బాలీవుడ్ హీరోయిన్.. హాలీవుడ్‏ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. పవర్‏ఫుల్ పాత్రలో బ్యూటీ..

ప్రపంచం నాశనం అయినా మన దగ్గర వేడి వేడి పాస్తా, చికెన్ రైస్.. ఎమర్జెన్సీ ఫుడ్ అంటూ పూరీ జగన్నాథ్ ఓపెన్ కామెంట్స్..