Breaking : ప్ర‌ముఖ న‌టుడు ‘కిక్’ శ్యామ్ అరెస్ట్…

ప్రముఖ సినీ నటుడు కిక్ శ్యామ్ ని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలోని కోడంబాక్కంలో పోకర్ క్లబ్ నడుపుతున్న‌ శ్యామ్... గ్యాంబ్లింగ్ కి పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు.

  • Ram Naramaneni
  • Publish Date - 9:26 am, Tue, 28 July 20
Breaking : ప్ర‌ముఖ న‌టుడు 'కిక్' శ్యామ్ అరెస్ట్...

Kick Shyam Arrested : ప్రముఖ సినీ నటుడు కిక్ శ్యామ్ ని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలోని కోడంబాక్కంలో పోకర్ క్లబ్ నడుపుతున్న‌ శ్యామ్… గ్యాంబ్లింగ్ కి పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఎటువంటి అనుమతులు లేకుండా పేకాట, బెట్టింగులు నిర్వ‌హిస్తుండ‌టంతో కేసు నమోదు చేశారు. తెలుగు, తమళ సినిమాల్లో న‌టించిన శ్యామ్ మంచి న‌టుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో కిక్, ఊసరవెల్లి ,రేసుగుర్రం, కిక్- 2 వంటి చిత్రాలలో నటించాడు శ్యామ్. ఎక్కువ‌గా ద‌ర్శ‌కుడు సురేంద్ర రెడ్డి సినిమాల్లో క‌నిపించాడు. కిక్ సినిమాలో అత‌డు మంచి పాత్ర వేయ‌డంతో తెలుగు జనాల్లో కిక్ శ్యామ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

 

Read More : బాలీవుడ్​లో విషాదం..ప్ర‌ముఖ యాక్షన్ డైరెక్టర్ కన్నుమూత