
రూత్ లెస్ పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్ గా ఇవాళ థియేటర్లలోకి అడుగు పెట్టాడు న్యాచురల్ స్టార్ నాని. అతను నటించిన తాజా చిత్రం హిట్-3 ది థర్డ్ కేస్. ‘హిట్’ ఫస్ట్, సెకండ్ కేస్‌లు తెరకెక్కించిన శైలేష్ కొలనునే ఈ మూవీకి కూడా దర్శకత్వం వహించాడు. గురువారం (మే01) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అర్జున్ సర్కార్ రోల్ లో నాని అదరగొట్టాడంటూ ప్రశంసలు వినిపిస్తున్నాయి. అలాగే యాక్షన్ సీక్వెన్స్ లు కూడా నెక్ట్స్ లెవెల్ లో ఉన్నాయని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. దీంతో మొత్తానికి నాని ఖాతాలో మరో సూపర్ హిట్ మూవీ పడిపోయింది. కాగా హిట్ సిరీస్ లో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి. ’హిట్’ లో విశ్వక్ సేన్, ‘హిట్ 2’ లో అడివి శేష్, ‘హిట్ 3’ లో నాని హీరోలుగా నటించారు. అయితే, ప్రతి సినిమా క్లైమాక్స్‌లో సీక్వెల్ హీరోను రివీల్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే హిట్ ఫోర్త్ కేస్‌లో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటిస్తాడని క్లారిటీ ఇచ్చేశారు. ఏసీపీ వీరప్పన్ పాత్రలో కార్తీ ఛార్జ్ తీసుకున్నారని హిట్-3 క్లైమాక్స్ లో ప్రకటించారు. దీంతో హిట్-4లో కార్తీ ఫైనల్ అయినట్లు తెలిసిపోయింది.
హిట్-4 సినిమాలో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానిగా కార్తీ సందడి చేయనున్నారు. కాగా సిరుత్తై, ఖాకీ తదితర సినిమాల్లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కార్తీ దుమ్ము రేపాడు. ఈ క్రమంలోనే ‘హిట్ 4’లో కార్తీ హీరో అని కొద్దిరోజుల నుంచే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు హిట్ -4 కు సంబంధించి కార్తీతో కొన్ని సన్నివేశాలని హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరించారని గుస గుసలు వినిపించాయి. ఇప్పుడు ఇవన్నీ నిజం అయ్యాయని చెప్పవచ్చు.
కాగా హిట్ సిరీస్ లో మొత్తం 8 సినిమాలు వస్తాయని గతంలో డైరెక్టర్ శైలేష్ కొలను వెల్లడించాడు. అంటే త్వరలో హిట్-4, హిట్-5, హిట్-6, హిట్-7, హిట్-8 సినిమాలు కూడా రానున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. అయితే హిట్-8లో హిట్ 1 నుంచి ‘హిట్ 7 వరకు నటించిన హీరోలందరూ కలిసి నటించనున్నట్లు తెలుస్తోంది.
Karthi’s cameo as Rathnavel Pandian in #HIT3 was a total show-stealer! 👮♂️🔥 That powerful entry has us hyped for what’s next. Bring on #HIT4! 💥 #Nani #SrinidhiShetty #SaileshKolanu#HIT3TheThirdCase #HIT3 pic.twitter.com/GvThz38uBf
— Movie Munch (@dailyaffairs12) May 1, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి