విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన విక్రమ్ (Vikram) సినిమా బ్లాక్ బస్టర్ హిట్‍గా నిలిచింది. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. చాలా కాలం తర్వాత మరోసారి తన నటనతో అదరగొట్టాడు స్టార్ హీరో కమల్.. అంతేకాకుండా తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటించడంతో ఈ సినిమా మరో లెవల్‌కు వెళ్లిందనే చెప్పుకొవాలి. స్టార్ హీరోస్ అంతా ఒక్క చోట చేరి నటించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం కమల్ విక్రమ్ సినిమా హిట్ జోష్ లో ఉన్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినందుకు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌కు ఖరీదైన బహుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో స్టార్ హీరో సూర్యకు విలువైన గిఫ్ట్ ఇచ్చి తన ప్రేమను చాటుకున్నాడు కమల్.
విక్రమ్ సినిమాలో కమల్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ నటనతో అదరగొట్టగా.. మూవీలో చివరలో అతిథిగా సూర్య ఎంట్రీ వేరేలెవల్.. చివరి మూడు నిమిషాలు సూర్య దడదడలాడించేశాడని ఇప్పటికే కమల్ తన సోషల్ మీడియా ఖాతాలో చెప్పుకొచ్చారు. సూర్య ఎంట్రీతో అటు ప్రేక్షకులు సైతం ఫుల్ ఖుషి అయ్యారు. తాజాగా హీరో సూర్యకు ఖరీదైన రోలెక్స్ వాచ్ గిఫ్ట్ ఇచ్చారు కమల్. Rolex Day-Date 40 Rose Gold President మోడల్ వాచ్ కానుగా ఇచ్చినట్లు తెలుస్తోంది. దాని ధర దాదాపు రూ. 62 లక్షలు ఉన్నట్లు అంచనా. కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చి తన ప్రేమను వ్యక్తపరిచాడు కమల్..తనకు బహుమతిగా ఇచ్చిన వాచ్ ఫోటోను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ కమల్ హసన్‌కు థ్యాంక్స్ తెలియజేశాడు హీరో సూర్య. ప్రస్తుతం అతని చేతికున్న వాచ్ ఫోటోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. వచ్చే సినిమాలో సూర్యతో కలిసి చేయబోతున్నట్లు కమల్ హసన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో సూర్య, కమల్ కాంబోలో రాబోతున్న సినిమా పై అంచనాలు భారీగానే నెలకొన్నాయి.
A moment like this makes life beautiful! Thank you Anna for your #Rolex! @ikamalhaasan pic.twitter.com/uAfAM8bVkM
— Suriya Sivakumar (@Suriya_offl) June 8, 2022