AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kamal Haasan: కలిసి సినిమా చేయకపోవడానికి కారణం అదే.. రజినీకాంత్‏తో స్నేహం పై కమల్ హాసన్ కామెంట్స్..

ఒకప్పుడు ఇద్దరు కలిసి అపూర్వ రాగంగళ్, అవల్ అప్పాడితాన్, 16 వయత్తినిలే, ఇలమై ఊంజల్ ఆడుకిరతు, తిల్లు ముల్లు, నినైతలే ఇనిక్కుమ్ సహా దాదాపు 16 సినిమాల్లో కలిసి నటించారు. చివరగా హిందీ సినిమా గెరాఫ్తార్ (1985)లో కలిసి కనిపించారు. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటించారు. అయితే ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో సూపర్‌స్టార్‌డమ్‌ సాధించిన తర్వాత వీరిద్దరూ కలిసి ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు.

Kamal Haasan: కలిసి సినిమా చేయకపోవడానికి కారణం అదే.. రజినీకాంత్‏తో స్నేహం పై కమల్ హాసన్ కామెంట్స్..
Kamal Haasan, Rajini Kanth
Rajitha Chanti
|

Updated on: Jul 02, 2024 | 3:02 PM

Share

తమిళ్ సినీ పరిశ్రమలోని అగ్ర కథానాయకులలో కమల్ హాసన్, రజనీకాంత్ గురించి చెప్పక్కర్లేదు. వీరిద్దరూ ఎవరికీ వారు తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. ఇద్దరికీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇద్దరికీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇప్పటికీ కుర్రహీరోలకు పోటీగా బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఇద్దరూ ప్రాణస్నేహితులే. ఒకప్పుడు ఇద్దరు కలిసి అపూర్వ రాగంగళ్, అవల్ అప్పాడితాన్, 16 వయత్తినిలే, ఇలమై ఊంజల్ ఆడుకిరతు, తిల్లు ముల్లు, నినైతలే ఇనిక్కుమ్ సహా దాదాపు 16 సినిమాల్లో కలిసి నటించారు. చివరగా హిందీ సినిమా గెరాఫ్తార్ (1985)లో కలిసి కనిపించారు. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటించారు. అయితే ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో సూపర్‌స్టార్‌డమ్‌ సాధించిన తర్వాత వీరిద్దరూ కలిసి ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. కానీ ఇద్దరి మధ్య స్నేహం మాత్రం ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కమల్ హాసన్ మాట్లాడుతూ రజినీకాంత్ తో తనకున్న స్నేహం గురించి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మీరిద్దరు కలిసి భవిష్యత్తులో మళ్లీ నటిస్తారా ? అని అడగ్గా ఆసక్తికర ఆన్సర్ ఇచ్చారు కమల్. “మా కాంబినేషన్ అనేది కొత్త కాదు. గతంలో మేమిద్దరం కలిసి చాలా సినిమాలు చేశాం. కానీ కొన్నాళ్లకు మేము కలిసి పనిచేయకూడదని అనుకున్నాం. మా ఇద్దరి మధ్య పోటీతత్వమే ఉంది. కానీ అసూయ లేదు. మా ఇద్దరి దారులు విభిన్నంగా ఉంటాయి. మాకు నిర్మాత కె. బాలచందర్ గురువు. మా ఇద్దరి మార్గాలు వేరైన కేవలం పోటీతత్వమే ఉంటుంది. మేమేప్పుడు ఒకరిపై మరొకరం చులకన వ్యాఖ్యలు చేసుకోము. మేము సీనియర్స్ కాబట్టి ఇలా ఉంటున్నాం అనుకోవద్దు. కానీ 20 ఏళ్ల నుంచి మేం ఇలాగే ఉంటున్నాం. ఇప్పటికీ మా స్నేహం కొనసాగుతూనే ఉంది” అని అన్నారు.

కమల్ హాసన్ ఇటీవలే ప్రభాస్ నటించిన కల్కి చిత్రంలో అతిథి పాత్రలో కనిపించాడు. అలాగే ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానుంది. అలాగే రజినీకాంత్ జైలర్ మూవీతో సూపర్ హిట్ అందుకోగా.. ఇప్పుడు వేట్టయాన్ చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us