Ugram: ‘ఉగ్రం’ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ ఆ హీరోనా ?.. నరేష్‏కు ఎలా చేరిందంటే..

|

May 02, 2023 | 10:38 AM

ఇక ఈ మూవీ ప్రమోషన్స్ సైతం వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో గ్రాండ్ గా నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకలో డైరెక్టర్ విజయ్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Ugram: ఉగ్రం సినిమాకు ఫస్ట్ ఛాయిస్ ఆ హీరోనా ?.. నరేష్‏కు ఎలా చేరిందంటే..
Ugram movie ott
Follow us on

ఇప్పటివరకు కామెడీ కథ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన హీరో అల్లరి నరేష్.. ఇప్పుడు పంథా మార్చుకున్నారు. గత కొంత కాలంగా సీరియస్ మూవీస్ చేస్తున్నారు. నాంది మూవీతో హిట్ అందుకున్న ఈ హీరో.. ఇప్పుడు ఉగ్రం సినిమాతో థియేటర్లలోకి రాబోతున్నారు. నాంది చిత్రానికి దర్శకత్వం వహించిన విజయ్ కనకమేడల ఈ సినిమాకు సైతం డైరెక్షన్ చేస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ మే 5న థియేటర్లలో విడుదల కాబోతుంది. నరేష్ ఫుల్ లెంగ్త్ మాస్ అండ్ కమర్షియల్ సినిమా చేసిన ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ సైతం వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో గ్రాండ్ గా నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకలో డైరెక్టర్ విజయ్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

నాంది సినిమా తర్వాత విజయ్ కనకమేడల నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కు ఒక కథ చెప్పారట. అయితే అందులో హీరో పోలీస్ ఆఫీసర్ కావడంతో ఆ చిత్రాన్ని రిజెక్ట్ చేశారట. అందుకు కారణం గతంలో పటాస్ చిత్రంలోనూ కళ్యాణ్ రామ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు. ఇక విజయ్ కళ్యాణ్ రామ్ కు చెప్పిన స్టోరీ ఉగ్రం సినిమాదే అని తెలుస్తోంది. ఈ సినిమా ఫుల్ లెంగ్త్ సీరియస్ రోల్ అవడంతో కాదన్నారట. కళ్యాణ్ రామ్ కు చెప్పినప్పుడు కేవలం ఐడియా మాత్రమే అని.. కానీ ఆ తర్వాత ఫుల్ స్టోరీని నరేష్ కు చెప్పడంతో ఆయన ఓకే అన్నారట.

ఇవి కూడా చదవండి

ఉగ్రం సినిమా కోసం నరేష్ చాలా కష్టపడ్డారని అన్నారు విజయ్ కనకమేడల. హైదరాబాద్ లో వణికించే చలి చంపేస్తున్న సమయంలోనూ వర్షంలో తీసే సీన్ కోసం ఎంతో కష్టపడి చేశారని తెలిపారు. అలాగే మరొక సీన్ లో ఒంటి మీద బ్లడ్ వేసుకున్నారని.. ప్రతి షాట్ ని ఫర్ఫెక్ట్ గా వచ్చేవరకు ఆయన పనిచేస్తూనే ఉంటారని… ఈ సినిమా కోసం ఆయన ప్రాణం పెట్టి పనిచేశారని అన్నారు. ఈ మూవీ మే 5న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.