Prabhas-Anushka: ఎంత ముద్దుగా పిలిచిందో.. ప్రభాస్, అనుష్కల ఇన్‌స్టా ఛాట్ వైరల్
అందుకు తగ్గట్టే ప్రభాస్- అనుష్క ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారనే వార్తలు కూడా తరచూ వస్తున్నాయి. అయితే చాలామంది అనుకున్నట్టు తమ మధ్య ఏమీ లేదని, కేవలం మంచి స్నేహితులేనని ప్రభాస్, అనుష్క ఇప్పటికే చాలాసార్లు చెప్పుకొచ్చారు.
Updated on: May 02, 2023 | 9:32 AM

టాలీవుడ్‌లో ప్రభాస్-అనుష్కల జోడీకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బిల్లా సినిమాలో మొదటిసారిగా కలిసి నటించిన వీరిద్దరూ ఆతర్వాత మిర్చి, బాహుబలి సిరీస్‌లతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు.

కేవలం సిల్వర్ స్క్రీన్ పైనే కాకుండా, ఆఫ్‌స్క్రీన్‌లోనూ ప్రభాస్- అనుష్కల జోడీకి బోలెడుమంది ఫ్యాన్స్ ఉన్నారు. నిజజీవితంలోనూ వీరిద్దరిని భార్యాభర్తలుగా చూడాలని చాలామంది కోరుకుంటున్నారు.

అందుకు తగ్గట్టే ప్రభాస్- అనుష్క ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారనే వార్తలు కూడా తరచూ వస్తున్నాయి. అయితే చాలామంది అనుకున్నట్టు తమ మధ్య ఏమీ లేదని, కేవలం మంచి స్నేహితులేనని ప్రభాస్, అనుష్క ఇప్పటికే చాలాసార్లు చెప్పుకొచ్చారు.

తాజాగా వీరిద్దరి రిలేషన్‌షిప్ మరోసారి నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. నిశ్శబ్ధం సినిమా తర్వాత అనుష్క నటిస్తోన్న చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టీజర్ బావుందంటూ పలువురు ప్రముఖులు అనుష్కకు అభినందనలు తెలిపారు. ఇక ప్రభాస్ అయితే ఇన్‌స్టా స్టోరీస్ వేదికగా ఈ టీజర్‌ను షేర్ చేస్తూ.. చాలా బాగుందంటూ ప్రశంసలు కురిపించాడు. దీనికి అనుష్క కూడా స్పందించింది. థ్యాంక్స్ 'పప్సు' అంటూ రిప్లై ఇచ్చింది.

ప్రస్తుతం ప్రభాస్, అనుష్కల ఇన్‌స్టా చాట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ స్టోరీని స్క్రీన్ షాట్ చేసిన పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అనుష్క ప్రభాస్‌ను ఎంత ముద్దుగా పిలిచిందో కదా? అంటూ కామెంట్లు పెడుతున్నారు.




