తన వీరాభిమాని మరణంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. శ్యామ్ మరణం తనను కలచివేసిందని అన్నారు. ఈ మేరకు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు తారక్. “శ్యామ్ మరణం అత్యంత బాధకరమైన సంఘటన. శ్యామ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఎటువంటి పరిస్థితులలో ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనసును కలచి వేస్తుంది. ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై తక్షణమే దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నాను” అంటూ రాసుకొచ్చారు తారక్. జూన్ 25న ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. శ్యామ్ మరణవార్త అటు కుటుంబసభ్యులతోపాటు.. తారక్ అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఇదిలా ఉంటే.. తన కొడుకు మరణంపై అనుమానాలు ఉన్నాయని.. తన కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని.. ఎవరో కావాలనే హత్య చేశారని ఆరోపిస్తున్నారు శ్యామ్ తండ్రి. దీంతో శ్యామ్ మరణానికి న్యాయం జరగాలని తారక్ అభఇమానులు సహా మిగతా స్టార్ హీరోస్ ఫ్యాన్స్ కూడా డిమాండ్ చేస్తున్నారు. ‘#WeWantJusticeForShyamNTR’ అంటూ ట్విట్టర్ వేదికగా హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది.
ఇదిలా ఉంటే.. తూర్పు గోదావరి జిల్లాలోని కొప్పిగుంట గ్రామానికి చెందిన శ్యామ్.. చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ వీరాభిమాని. తారక్ ప్రతి సినిమా ఈవెంట్ పనుల్లో చురుగ్గా పాల్గొనేవాడు. ఇటీవల మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చిన తారక్ తో ఫోటో దిగేందుకు ట్రై చేశాడు. వేదికపై తారక్ తో ఫోటో దిగేందుకు వెళ్లగా.. బాడీగార్డ్స్ పక్కకు జరిపారు. ఆ తర్వాత తారక్ పిలిచి మరీ ఫోటో దిగి పంపించాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.