Jr.NTR-RRR: ఆస్కార్ అవార్డ్స్ పై తారక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. భారతదేశం మొత్తం మా గుండెల్లో..

|

Mar 10, 2023 | 12:39 PM

కొద్ది రోజులుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ రాజమౌళి తమ సినిమా ప్రమోషన్స్‏లో పాల్గొంటుండగా.. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లారు. దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆస్కార్ అవార్డ్స్ గురించి .. తెలుగు సినిమా స్థాయి గురించి

Jr.NTR-RRR: ఆస్కార్ అవార్డ్స్ పై తారక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. భారతదేశం మొత్తం మా గుండెల్లో..
ఆర్ఆర్ఆర్ సినిమాలో కీలక పాత్ర పోషించిన జూనియర్ ఎన్టీఆర్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీలో పట్టభద్రుడు.
Follow us on

95వ అకాడమీ అవార్డ్స్ కోసం ట్రిపుల్ ఆర్ చిత్రం నుంచి నాటు నాటు సాంగ్ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ వేడుకల కోసం ఇప్పటికే ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ అమెరికాలో సందడి చేస్తుంది. కొద్ది రోజులుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ రాజమౌళి తమ సినిమా ప్రమోషన్స్‏లో పాల్గొంటుండగా.. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లారు. దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆస్కార్ అవార్డ్స్ గురించి .. తెలుగు సినిమా స్థాయి గురించి అమెరికా మీడియాతో ముచ్చటిస్తున్నారు మన తెలుగు స్టార్స్. ప్రపంచాన్నే ఊర్రూతలుగించిన నాటు నాటు సాంగ్ ఇప్పుడు భారతీయుల గర్వకారణంగా నిలిచింది. ఈ క్రమంలో ఆస్కార్ అవార్డ్స్.. నాటు నాటు సాంగ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఎన్టీఆర్. ఇటీవల et the oscarsకి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తారక్ మాట్లాడుతూ.. రెడ్ కార్పెట్ పై నడిచేది మేము కాదని.. యావత్ భారతదేశాన్ని గుండెల్లో పెట్టుకుని గర్వంగా భారతీయులము నడుస్తామని అన్నారు.

“రెడ్ కార్పెట్ పై నడవబోయేది జూనియర్ ఎన్టీఆర్ లేదా కొమురం భీమ్ అని నేను అనుకోను. రెడ్ కార్పెట్ పై నడిచేది యావత్ భారతదేశం. ఆస్కార్ వేడుకలలో పాల్గొంటున్నప్పుడు మా గుండెల్లో మా దేశాన్ని మోయబోతున్నాం. అందుకు మేము గర్వంగా ఫీల్ అవుతామ. మా గుండెల్లో మా దేశ గౌరవాన్ని మోస్తూ.. రెడ్ కార్పెట్ పై నడుస్తాము. అలాగే ఇప్పుడు ఆస్కార్ కోసం నామినేట్ అయిన నాటు నాటు పాటకు డాన్స్ చేయడం చాలా కష్టతరమైనది. షూటింగ్ కు వారం రోజుల ముందు నుంచే మేము ప్రాక్టీస్ చేశాము. షూటింగ్ సమయంలో కూడా ఎన్నోసార్లు రిహార్సల్స్ చేశాము. ఇప్పటికీ నా కళ్లు హర్ట్ అయ్యే ఉన్నాయి” అంటూ చెప్పుకొచ్చారు తారక్.

ఇవి కూడా చదవండి

అలాగే ఆస్కార్ వేదికపై మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి.. సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఈ సాంగ్ ఆలపించబోతున్నారు. ఈ అద్భుత క్షణాన్ని చూసేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాని అన్నారు ఎన్టీఆర్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.