Jr NTR: నందమూరి తారకరాముడి ఇంటిని చూశారా ?.. వైరలవుతున్న ఎన్టీఆర్ విలాసవంతమైన భవనం ఫోటోస్..

|

Dec 30, 2022 | 1:32 PM

ప్రస్తుతం ఆయన మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. కొద్ది రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి కాస్త బ్రేక్ తీసుకుని.. అమెరికాలో ఫ్యామిలీతో ఇయర్ ఎండ్ ఎంజాయ్ చేస్తున్నారు ఎన్టీఆర్.

Jr NTR: నందమూరి తారకరాముడి ఇంటిని చూశారా ?.. వైరలవుతున్న ఎన్టీఆర్ విలాసవంతమైన భవనం ఫోటోస్..
Ntr
Follow us on

ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్నారు ఎన్టీఆర్. సీనియర్ హీరో నందమూరి ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తారక్.. తన నటనతో వేలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో అలరించిన తారక్.. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. కొద్ది రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి కాస్త బ్రేక్ తీసుకుని.. అమెరికాలో ఫ్యామిలీతో ఇయర్ ఎండ్ ఎంజాయ్ చేస్తున్నారు ఎన్టీఆర్. అక్కడినుంచే కొత్త సంవత్సరానికి స్వాగతం పలకనున్నట్లు తెలుస్తోంది. అయితే తారక్ సోషల్ మీడియాలో చాలా తక్కువగా టైమ్ స్పెండ్ చేస్తుంటారు. ముఖ్యంగా తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోస్ నెట్టింట్లోకి రావడం చాలా అరుదు. ఇప్పటివరకు తన సతీమణి, కుమారులతో కలిసి ఉన్న ఫోటోస్ రెండు మూడు మాత్రమే పోస్ట్ చేశారు తారక్.

అయితే తాజాగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఇంటికి సంబంధించిన ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. అందులో తారక్ తన ఇంట్లో ఫ్యామిలీతో గడిపిన విలువైన సమయం చూసి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. తారక్ హౌస్.. జూబ్లీహిల్స్ లో ఉన్నట్లు తెలుస్తోంది. దాని విలువ రూ. 25 కోట్లు అని టాక్. ఇంట్లో లివింగ్ రూమ్ ను పాష్ ఇంటీరియర్‌తో అలంకరించారు. ఇల్లు పురాతన, ప్రత్యేకమైన డిజైన్‌ల మంచి కలయికగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

అలాగే ఇంటి పక్కనే తోట.. ఊయల ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. తారక్ ఇంటి బయట ప్రవేశ ద్వారం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అక్కడ భారీ గంట ఉంటుంది. ఇంట్లోనే ఓ హోమ్ థియేటర్ కూడా ఉంటుంది. తారక్ కు కార్లు అంటే విపరీతమైన ఇష్టం. ఆయన వద్ద ఆడి, రేంజ్ రోవర్, మెర్సిడెస్ వంటి కార్లు ఉన్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.