AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jagapati Babu : నేను హీరో మెటిరియల్ కాదు.. ఆ సినిమా చేయను అని చెప్పా.. ఆ నటుడు ఏమన్నాడంటే.. జగపతి బాబు..

నేను హీరో మెటీరియల్ కాదని, హీరో అనే ట్యాగ్‌ను నమ్మనని అన్నారు విలక్షణ నటుడు జగపతిబాబు. అలాగే తనపై తొమ్మిది కోట్లు పెట్టి సినిమా తీస్తే కచ్చితంగా నష్టపోతారని తాను ముందే హెచ్చరించానని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ వదలా. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతి బాబు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Jagapati Babu : నేను హీరో మెటిరియల్ కాదు.. ఆ సినిమా చేయను అని చెప్పా.. ఆ నటుడు ఏమన్నాడంటే.. జగపతి బాబు..
Jagapati Babu
Rajitha Chanti
|

Updated on: Jul 16, 2026 | 4:07 PM

Share

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న నటుడు జగపతిబాబు. ప్రస్తుతం సహయ నటుడిగా రాణిస్తున్న ఆయన.. ఇప్పుడు ప్రధాన పాత్రలో నటించిన సినిమా వదలా. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను హీరో మెటీరియల్ కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరో అనే ట్యాగ్‌ను తాను నమ్మనని, సినిమా టైటిల్స్, హీరో ఇమేజ్ వంటి వాటి గురించి లెక్కలు వేసుకోనని ఆయన స్పష్టం చేశారు. “నేను ఎప్పుడూ పెద్ద హీరోని కాను. ఏదో ఇమేజ్ ఉంటుంది, కానీ నా ప్రకారం ఇమేజ్ అనేది ఏమీ కాదు. ఒకే ఇమేజ్‌తో ఎన్ని సినిమాలు చేస్తాం? ఎక్కడో ఆగిపోతాం. అసలు నేను హీరో కాన్సెప్ట్‌ను నమ్మను. హీరో అనేది కేవలం ఒక ట్యాగ్ మాత్రమే. జీవితంలో హీరోగా ఉండాలి కానీ, సినిమాల్లో కాదు” అని జగపతిబాబు అన్నారు. సినిమాల్లో హీరోగా వచ్చిపోయే పాత్రల మాదిరిగానే జీవితంలో సంతోషం, బాధ వంటివి కూడా తాత్కాలికమేనని, అవి వచ్చిపోతుంటాయని చెప్పుకొచ్చారు.

తన చిన్నతనం నుంచే అన్నింటినీ వదిలేయడం, సరెండర్ అవ్వడం అలవాటు చేసుకున్నానని జగపతిబాబు పేర్కొన్నారు. “అన్నీ సరెండర్, సరెండర్, సరెండర్, సబ్మిషన్, వదిలేయడమే. ఎందుకంటే దట్ ఈజ్ ద వే లైఫ్ ఈజ్. ఇప్పుడు వదలాలి. ఇప్పుడు హ్యాపీనెస్, శాడ్ నెస్ అన్నీ కూడా టెంపరరీయే. వచ్చి పోయే. ఇవి కూడా అంతే” అని ఆయన తన తత్వాన్ని తెలియజేశారు. హీరోగా కెరీర్ ముగిసిన తర్వాత నెక్స్ట్ ఏమిటి అనే ప్రశ్న తనకు చాలా సింపుల్‌గా మారిందని, తాను పరిశ్రమలోకి రాకముందే ఆ హీరో ట్యాగ్‌ను డ్రాప్ చేశానని తెలిపారు. అయితే, నిర్మాతలు కోరడం వల్ల కొన్ని సినిమాలు చేయాల్సి వచ్చిందని చెప్పారు.

ప్రవరాఖ్యుడు సినిమా సమయంలో జరిగిన ఒక సంఘటనను ఆయన వివరించారు. అది 2009 నాటి విషయం అని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తాను రాజరవీంద్రకు చెప్పానని, “నా మీద తొమ్మిది కోట్లు పెట్టి సినిమా చేస్తే అది వర్కౌట్ కాదు. 100% డబ్బులు పోతాయి” అని స్పష్టంగా హెచ్చరించినట్లు పేర్కొన్నారు. అప్పుడు రాజరవీంద్ర, “సార్, మీకు ఉన్న ఒక సినిమా అది. అది కూడా వదులుకుంటారా? డ్రాప్ చేస్తారా?” అని అడిగారని తెలిపారు. అందుకు తాను, “డబ్బులు కూడా పోతాయి కదా? వాట్ ఈజ్ ద పాయింట్? ఎవడో కొన్నప్పుడు ఆ సినిమా డబ్బులు తీసుకున్నప్పుడు అది ఫ్లాప్ కింద లెక్కే కదా?” అని సమాధానం ఇచ్చినట్లు చెప్పారు. అప్పటికే తాను హీరో మెటీరియల్ కానని, ఆ చాప్టర్ ముగిసిందని అంగీకరించానని జగపతిబాబు వెల్లడించారు. గతంలో గుమ్మడి గారు, కాంతారావు వంటి నటుల గురించి ప్రస్తావిస్తూ, ఒకే రకమైన పాత్రలు లేదా ఇమేజ్ వస్తే ఆ ముద్ర పడిపోతుందనే భయం తనలో లేదని జగపతిబాబు స్పష్టం చేశారు. అందుకే, క్యారెక్టర్ రోల్స్, మల్టీస్టారర్లలో నటించడానికి తనకు ఎటువంటి భయం లేదని, “మళ్లీ క్యారెక్టర్ ఇస్తారేమో, హీరో ఇవ్వరేమో” అనే ఆలోచన తనకు లేదని అన్నారు. జీవితం చాలా సింపుల్‌గా ఉంటుందని, దానిని అంతే సింపుల్‌గా చూడాలని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..

Follow Us