తమిళ్ స్టార్ హీరో ధనుష్(Dhanush)కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ధనుష్. ధనుష్ (Dhanush) నేరుగా తెలుగులో నటిస్తోన్న చిత్రం సార్. డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళంలోనూ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. భీమ్లా నాయక్ బ్యూటీ సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తోన్న ఈ మూవీని అక్టోబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇదిలా ఈ లోగా మరికొన్ని సినిమాలు కూడా చేస్తున్నాడు. అందులో కెప్టెన్ మిల్లర్ సినిమా ఒకటి.
భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక నిపుణులు పనిచేస్తున్న ఈ సినిమాలో వెర్సటైల్ హీరో సందీప్ కిషన్ ఒక కీలక పాత్ర కోసం ప్రాజెక్ట్ లో జాయిన్ అయ్యాడు. విలక్షణమైన కథలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలు సొంతం చేసుకొని దూసుకెళ్తున్నారు సందీప్ కిషన్. విజయ్ సేతుపతి, గౌతమ్ వాసుదేవ్ మీనన్ వంటి బిగ్ స్టార్ల తో కలిసి సందీప్ చేస్తున్న ‘మైఖేల్’ చిత్రం కూడా భారీ అంచనాలను పెంచింది. సందీప్ కిషన్, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘మానగరం’లో హీరోగా తన అద్భుతమైన నటనతో తమిళ ప్రేక్షకులను కూడా మెప్పించిన విషయం తెలిసిందే. మోస్ట్ ప్రామెసింగ్ హీరో సందీప్ కిషన్ ఇప్పుడు ‘కెప్టెన్ మిల్లర్’ ప్రాజెక్ట్ లోకి రావడంతో ఈ సినిమా పై ఆసక్తి పెరిగింది. 1930-40ల నేపధ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కతున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందతోంది. అరుణ్ మాథేశ్వరన్ దర్సకత్వం వహిస్తున్న ఈ చిత్రం సత్యజ్యోతి ఫిలింస్ పతాకంపై టి జి త్యాగరాజన్ సమర్పణలో సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..