Darshan: ఇకపై ఆ పప్పులుడకవ్.. బళ్లారి సెంట్రల్ జైలుకు దర్శన్ తరలింపు.. హీరోపై మరిన్ని కఠిన ఆంక్షలు

రేణుకా స్వామి హత్యకేసులో పరప్పన అగ్రహారంలో నిందితుడిగా ఉన్న దర్శన్‌కు రాజ మర్యాదలు అందుతున్నట్లు రుజువైంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోంమంత్రి జి. పరమేశ్వర్ దీనిని సీరియస్ గా తీసుకున్నారు. దీని ప్రకారం దర్శన్ మరో జైలుకు తరలించడంపై న్యాయ స్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Darshan: ఇకపై ఆ పప్పులుడకవ్.. బళ్లారి సెంట్రల్ జైలుకు దర్శన్ తరలింపు.. హీరోపై మరిన్ని కఠిన ఆంక్షలు
Darshan

Updated on: Aug 28, 2024 | 7:48 AM

ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ తన స్వీయ తప్పిదాలతో మరిన్ని కష్టాలు కొని తెచ్చుకున్నాడు. పరప్పన అగ్రహారం జైలులో నిబంధనలు ఉల్లంఘించినందుకు అతనిని ఇప్పుడు మరో జైలుకు తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో అతను ఇక నుంచి కుటుంబాన్ని కలవడం కష్టమవుతుంది. అలాగే, జైలు శిక్ష మరింత కఠినతరం కానుంది. రేణుకా స్వామి హత్యకేసులో పరప్పన అగ్రహారంలో నిందితుడిగా ఉన్న దర్శన్‌కు రాజ మర్యాదలు అందుతున్నట్లు రుజువైంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోంమంత్రి జి. పరమేశ్వర్ దీనిని సీరియస్ గా తీసుకున్నారు. దీని ప్రకారం దర్శన్ మరో జైలుకు తరలించడం ఖాయం . పరప్పను అగ్రహారం నుంచి బళ్లారి సెంట్రల్ జైలుకు తరలించేందుకు కోర్టు అనుమతి లభించింది. ఈ మేరకు బెంగళూరులోని 24వ ఏసీఎంఎం కోర్టు మంగళవారం (ఆగస్టు 27) ఉత్తర్వులు జారీ చేసింది.

దర్శన్ మాత్రమే కాదు, రేణుకాస్వామి హత్య కేసులో నిందితులందరినీ వేర్వేరు జైళ్లకు తరలించనున్నారు. ఈ మేరకు కోర్టు నుంచి పోలీసులకు ఆదేశాలు అందాయి. నిందితులను బదిలీ చేయాలని చీఫ్ సూపరింటెండెంట్ కోర్టును ఆశ్రయించారు. ఉత్తర్వులు అందడంతో నిందితులందరి తరలింపు ప్రక్రియను ప్రారంభించారు. ప్రధాన నిందితుడు దర్శన్ బళ్లారి జైలులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణలకు హాజరయ్యే వ్యవస్థ ఉంది.కాగా దర్శన్‌ని బళ్లారి జైలుకు, పవన్‌, రాఘవేంద్ర, నందీష్‌లను మైసూర్‌ జైలుకు తరలించనున్నారు. జగదీష్‌ను షిమోగా జైలుకు, ధనరాజ్‌ను ధార్వాడ జైలుకు తరలించారు. వినయ్‌ని విజయపుర జైలుకు తరలించాలి. నాగరాజ్‌ను కలబురగి జైలుకు, లక్ష్మణ్‌ను షిమోగా జైలుకు, ప్రదుష్‌ను బెల్గాం జైలుకు తరలించనున్నారు.

ఇవి కూడా చదవండి

మిగిలిన నిందితులు పవిత్రగౌడ్, అనుకుమార్, దీపక్ పరప్ప అగ్రహారంలోనే కొనసాగనున్నారు. పవిత్ర గౌడ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, విచారణను ఆగస్టు 28కి మార్చారు. నిందితులు రవి, కార్తీక్, నిఖిల్, కేశవమూర్తి ఇప్పటికే తుమకూరు జైలులో తీగలు లెక్కిస్తున్నారు.

జైలులో హీరో దర్శన్ జల్సాలు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.