Chiranjeevi KTR: కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్‌.. ఈ రోజు ఆ పని చేయండంటూ ట్వీట్‌..

Chiranjeevi KTR: తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంటూ డైనమిక్‌ లీడర్‌గా దూసుకుపోతున్నారు మంత్రి కేటీఆర్‌. వేదిక ఏదైనా తన వాగ్దాటితో ఆకట్టుకునే కేటీఆర్‌...

Chiranjeevi KTR: కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్‌.. ఈ రోజు ఆ పని చేయండంటూ ట్వీట్‌..
Chiru Ktr Birthday

Updated on: Jul 24, 2021 | 5:39 AM

Chiranjeevi KTR: తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంటూ డైనమిక్‌ లీడర్‌గా దూసుకుపోతున్నారు మంత్రి కేటీఆర్‌. వేదిక ఏదైనా తన వాగ్దాటితో ఆకట్టుకునే కేటీఆర్‌ కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా సినీ తారల తోనూ సాన్నిహిత్యంగా ఉంటారని విషయం తెలిసిందే. ఇప్పటి వరకు మంత్రి కొన్ని సినిమా వేడుకలకు హాజరుకావడమే దీనికి ఉదాహరణ చెప్పవచ్చు. ఇక నేడు (శనివారం) కేటీఆర్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా రాజకీయ నాయకులతో పాటు సినీ తారలు కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు. శుక్రవారం రాత్రి నుంచే ట్విట్టర్‌లో కేటీఆర్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ క్రమంలోనే టాలీవుడ్‌ మెగా స్టార్‌ చిరంజీవి కూడా కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ట్వీట్‌ చేసిన చిరు.. ‘కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ సందర్భంగానే కాకుండా ప్రతీ సందర్భంలోనూ మొక్కలు నాటండి, వాటిని సంరక్షించండి. దీని ద్వారా రోజురోజుకూ పెరిగిపోతున్న గ్లోబల్‌ వార్మింగ్‌కు చెక్‌ పెట్టాలి. మనం ప్రకృతిని రక్షిస్తే.. అది మన్నలి కాపాడుతుంది. ఎంపీ సంతోష్‌ కుమార్‌కు కృతజ్ఞతలు’ అంటూ రాసుకొచ్చారు చిరు. ఇక తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలను నాటాలనే సంకల్పంతో టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌ కుమార్‌.. ముక్కోటి వృక్షార్చన, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ ఛాలెంజ్‌లో సినిమా పరిశ్రమకు చెందిన బడా తారలు సైతం పాల్గొన్నారు.

చిరు చేసిన ట్వీట్‌..

Also Read: Surya: ఆసక్తికరంగా సూర్య న్యూమూవీ పోస్టర్.. ఈ సారి జై భీమ్ అంటున్న వెర్సటైల్ హీరో

Megastar Chiranjeevi: మెగాఫ్యాన్స్‌‌‌కు గుడ్ న్యూస్.. చిరు153వ సినిమా పనులు ప్రారంభం అయ్యాయి..

Samantha: నా ఫేవరెట్‌ ఆలీగారు.. ఆసక్తికర కామెంట్లు చేసిన అక్కినేని సమంత