AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ప్రభాస్ ఎంట్రీ సీన్ అదిరిపోతుంది.. క్లైమాక్స్ చూసి కన్నీళ్లు.. కన్నప్పపై అంచనాలు పెంచేసిన నటుడు..

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ కన్నప్ప. జూన్ 27న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఇందులో పాల్గొన్న రచయిత, దర్శకుడు, నటుడు బీవీఎస్ రవి సినిమా పై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Prabhas: ప్రభాస్ ఎంట్రీ సీన్ అదిరిపోతుంది.. క్లైమాక్స్ చూసి కన్నీళ్లు.. కన్నప్పపై అంచనాలు పెంచేసిన నటుడు..
Kannappa
Rajitha Chanti
|

Updated on: Jun 22, 2025 | 9:20 AM

Share

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. అత్యంత ప్రతిష్టాత్మకంగా మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, శరత్ కుమార్, కాజల్, మధుబాల ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇక తాజాగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న స్టార్స్ సైతం కన్నప్ప సినిమా గురించి గొప్పగా చెప్పారు. ఇక నటుడు, రచయిత, డైరెక్టర్ బీవీఎస్ రవి సైతం ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. గతంలోనే కన్నప్ప సినిమాపై హైప్ పెంచేసిన ఆయన.. ఇప్పుడు మరోసారి అంచనాలు పెంచేశారు. శనివారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన చేసిన కామెంట్స్ తో డార్లింగ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అందుకు కారణం లేకపోలేదు.

బీవీఎస్ రవి మాట్లాడుతూ.. “భారీ బడ్జెట్ పెట్టి కన్నప్ప సినిమాను ఎందుకు తీస్తున్నారని భయపడ్డాను. కానీ నాకు బ్రహ్మాజీ ఈ సినిమా గురించి చెప్పారు. న్యూజిలాండ్ నుంచి అలా దిగి ఇలా కన్నప్ప అద్భుతంగా వస్తోందని అన్నారు. ఒకసారి మోహన్ బాబు గారు ఈ సినిమా చూస్తావా ? అడిగి మరీ ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఫస్ట్ హాఫ్ చూసి నాకు ఒళ్లు జలదరించింది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఏం తీశార్రా బాబు అనిపించింది. మోహన్ బాబు గారు అక్కడే ఉన్నారు. ఎలా చెప్పాలి.. ఏం చెప్పాలో అర్థం కాలేదు. వెంటనే విష్ణుకు కాల్ చేసి సినిమా అద్భుతంగా వచ్చిందని చెప్పాలని అనుకున్నారు. ఐదారు సార్లు కాల్ చేస్తే లిఫ్ట్ చేశారు. ఏం చెప్పాలో అర్థం కాక నోటి మాట రాలేదు.

ఇక ఇంటర్వెల్ తర్వాత 15 నిమిషాలకు ప్రభాస్ ఎంట్రీ సీన్ వస్తుంది. ఆ సీన్ తో సినిమా స్థాయి వేరే లెవల్ కు వెళ్తుంది. ప్రభాస్ ఎంట్రీతో మోహ్ బాబు సీన్, విష్ణు సీన్ ఇలా అర్దగంట సేపు అందిర సీన్స్ అదరిపోతాయి. ఇక క్లైమాక్స్ లో విష్ణు యాక్టింగ్ చూసి నా కళ్లు చెమ్మగిల్లాయి. సినిమా చూసిన తర్వాత కంట్లోంచి ఆనంద భాష్పాలు వచ్చాయి. ఈసినిమా తెలుగు చిత్రపరిశ్రమలో ఈ క్లైమాక్స్ నిలిచిపోతుంది” అన్నారు.

ఇవి కూడా చదవండి :  

వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..

సీరియల్లో పద్దతిగా.. వెకేషన్‏లో గ్లామర్‏గా.. రుద్రాణి అత్త అరాచకమే..

త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..

Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..

Follow Us