AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmaji: ఆయన గొప్ప నటుడు.. అర్దరాత్రి ఫోన్ చేసి నా జాతకమే మార్చేశారు.. బ్రహ్మాజీ కామెంట్స్..

తెలుగు సినిమా పరిశ్రమలో దాదాపు మూడు దశాబ్దాలుగా విరామం లేకుండా నటిస్తూ, ప్రతి తరానికి కనెక్ట్ అయిన విలక్షణ నటుడు బ్రహ్మాజీ. సీరియస్ విలనిజం, ఎమోషనల్ క్యారెక్టర్లు, హిలేరియస్ కామెడీ.. ఇలా ఏ పాత్ర ఇచ్చినా అందులో ఇట్టే ఒదిగిపోవడం ఆయన ప్రత్యేకత. పరిశ్రమలో అందరి హీరోలతోనూ, దర్శకులతోనూ మంచి అనుబంధం ఉన్న అతికొద్ది మంది నటుల్లో బ్రహ్మాజీ ఒకరు.

Brahmaji: ఆయన గొప్ప నటుడు.. అర్దరాత్రి ఫోన్ చేసి నా జాతకమే మార్చేశారు.. బ్రహ్మాజీ కామెంట్స్..
Brahmaji
Rajitha Chanti
|

Updated on: Jun 05, 2026 | 1:15 PM

Share

టాలీవుడ్‌లో దశాబ్దాలుగా విలక్షణ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న నటుడు బ్రహ్మాజీ. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘సింధూరం’ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఆ తర్వాత వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ బిజీగా మారారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి తనపై చూపించిన ప్రత్యేక శ్రద్ధ, పెద్ద మనసు గురించి బ్రహ్మాజీ పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. బ్రహ్మాజీ మాట్లాడుతూ.. ‘సింధూరం’ సినిమా విడుదలైన కొత్తలో తన జాతకాన్ని మార్చిన ఒక సంఘటనను గుర్తుచేసుకున్నారు. అప్పట్లో గుణశేఖర్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ‘చూడాలని ఉంది’ సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమాలో కలకత్తా నేపథ్యంలో సాగే ఒక చిన్న నెగిటివ్ క్యారెక్టర్ కోసం దర్శకుడు గుణశేఖర్ మొదట బ్రహ్మాజీని అనుకున్నారు. షూటింగ్ డేట్స్, మిగిలినవన్నీ కూడా ఖరారైపోయాయి. అయితే సడన్ గా ఒకరోజు చిరంజీవి ఆ పాత్రను ఎవరు వేస్తున్నారని అడగ్గా.. బ్రహ్మాజీ అని చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Peddi Movie : ఏం తీశాడు భయ్యా.. చరణ్ ఎంట్రీ మైండ్ బ్లోయింగ్.. ఆ ఒక్క సీన్ గూస్ బంప్స్..

ఇప్పుడే ‘సింధూరం’ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బ్రహ్మాజీని, ఇంత చిన్న నెగిటివ్ క్యారెక్టర్‌లో పెట్టడం ఏంటి? అతని కెరీర్ దెబ్బతింటుంది కదా అని చిరంజీవి ఆందోళన చెందారు. వెంటనే ఆయన కృష్ణవంశీకి ఫోన్ చేసి ఈ విషయం అడిగారు. ఆ తర్వాత ఏకంగా అర్ధరాత్రి 12 గంటలకు దర్శకుడు గుణశేఖర్‌ను నిద్ర లేపి మరీ.. “బ్రహ్మాజీని ఈ పాత్రలో ఎలా ప్రెసెంట్ చేస్తున్నావ్? స్క్రీన్ ప్లే ఏంటి?” అని కంప్లీట్ గా అడిగి తెలుసుకున్నారు. క్యారెక్టర్ చిన్నదైనా ప్రెసెంటేషన్ బాగుంటుందని గుణశేఖర్ వివరించడంతో చిరంజీవి సంతృప్తి చెందారని చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Meenakshi Chaudhary : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. ఎప్పటికైన అతడితో ‏డేట్‏కు వెళ్తాను.. హీరోయిన్ మీనాక్షి చౌదరి..

ఒక చిన్న ఆర్టిస్ట్ కెరీర్ పాడవకూడదని మెగాస్టార్ అంతలా కేర్ తీసుకోవడం నిజంగా గొప్ప విషయమని, ఆ పాత్ర వల్లే తన కెరీర్ మరో మలుపు తిరిగిందని బ్రహ్మాజీ ఎమోషనల్ అయ్యారు. చిరంజీవి ఆ పెద్ద మనసే ఆయనను మెగాస్టార్‌ను చేసిందని అభిమానులు ఈ వీడియోపై కామెంట్లు పెడుతున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Brahmanandam : చివరి రోజుల్లో ఎంఎస్ నారాయణ కోరిన ఆఖరి కోరిక అదే.. హాస్పిటల్ బెడ్ మీద అలా చూశాక.. బ్రహ్మానందం ఎమోషనల్..

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో అద్భుతమైన వ్యక్తి.. వయసులో చిన్నోడైనా చేతులెత్తి నమస్కరిస్తున్నా..

Follow Us
అర్దరాత్రి ఫోన్ చేసి నా జాతకమే మార్చేశారు.. బ్రహ్మాజీ కామెంట్స్.
అర్దరాత్రి ఫోన్ చేసి నా జాతకమే మార్చేశారు.. బ్రహ్మాజీ కామెంట్స్.
స్నానం చేసే నీటిలో చిటికెడు కర్పూరం వేయండి..ఈ ప్రయోజనాలు తెలిస్తే
స్నానం చేసే నీటిలో చిటికెడు కర్పూరం వేయండి..ఈ ప్రయోజనాలు తెలిస్తే
మీకు ఖాళీ స్థలం లేదా బిల్డింగ్ ఉందా.. ఇంట్లో కూర్చునే నెలకు..
మీకు ఖాళీ స్థలం లేదా బిల్డింగ్ ఉందా.. ఇంట్లో కూర్చునే నెలకు..
బుడ్డోడి ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీమిండియాలోకి ఆయా షేర్?
బుడ్డోడి ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీమిండియాలోకి ఆయా షేర్?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: భారీ జీతంతో పీసీబీలో ఉద్యోగాలు..
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: భారీ జీతంతో పీసీబీలో ఉద్యోగాలు..
ఈ క్లూస్‌ని బట్టి పాట ఏంటో మీరు కనిపెట్టగలరా..?
ఈ క్లూస్‌ని బట్టి పాట ఏంటో మీరు కనిపెట్టగలరా..?
ఓటీటీలో రచ్చ చేస్తున్న డార్క్ కామెడీ..
ఓటీటీలో రచ్చ చేస్తున్న డార్క్ కామెడీ..
ఆకలి లేని వారు చింత కాయ పచ్చి రొయ్యల కూర తింటే ఆ సమస్య పరార్
ఆకలి లేని వారు చింత కాయ పచ్చి రొయ్యల కూర తింటే ఆ సమస్య పరార్
ఏమిట్రా బాబు ఈ సైబర్ డెక్కింగ్.. పిచ్చెక్కిస్తున్నారుగా.!
ఏమిట్రా బాబు ఈ సైబర్ డెక్కింగ్.. పిచ్చెక్కిస్తున్నారుగా.!
తెలంగాణ ఓటర్లకు అలర్ట్! 30 లక్షల ఓట్ల తొలగింపు? చెక్ చేసుకోండిలా
తెలంగాణ ఓటర్లకు అలర్ట్! 30 లక్షల ఓట్ల తొలగింపు? చెక్ చేసుకోండిలా