
సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడం అంత ఈజీ కాదు. అవకాశాలు రావడమే చాలా గొప్పగా భావిస్తూ ఉంటారు. ఇక కొంతమంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సినిమాలు చేస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం అవకాశాలు తగ్గడంతో వేరే పనులు చేస్తున్నారు. ఇంకొంతమంది స్టార్ డమ్ సొంతం చేసుకున్నవారు అవకాశాలు తగ్గడంతో చిన్న చిన్న పాత్రలు చేయడం.. చిన్న సినిమాల్లో నటించడంలాంటివి చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఓ స్టార్ నటుడు అవకాశాలు తగ్గిపోవడంతో బిగ్రేడ్ సినిమాల్లో నటించాడు. దాంతో ఆయన పై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. దీని పై ఆయన క్లారిటీ ఇచ్చారు. పొట్టకూటి కోసమే అలా బీ గ్రేడ్ సినిమాల్లో నటించాల్సి వచ్చింది అని తెలిపాడు. ఆ నటుడు ఇంతకూ ఆ టాలీవుడ్ నటుడు ఎవరో ఇప్పుడు చూద్దాం.!
ఆశిష్ విద్యార్థిని తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయన ఎన్నో సినిమాలతో ద్వారా మనకు సుపరిచితుడు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో నటించాడు. ముఖ్యంగా పోకిరి సినిమాలో విలన్‌గా అతడి నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. గతంలో ఎక్కువ విలర్ రోల్స్ చేసిన ఈ యాక్టర్.. ఇప్పుడు ఫాదర్ తరహా రోల్స్ చేస్తున్నారు. మొన్నామధ్య లేటు వయసులో సెకండ్ మ్యారేజ్ చేసుకొని వార్తల్లో నిలిచారు. 60 ఏళ్ల వయస్సులో ఈయన సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం.. అటు నార్త్ ఇండస్ట్రీ, ఇటు సౌత్ ఇండస్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. అస్సాంకు చెందిన ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్ రూపాలి బారువాను వివాహం చేసుకున్నాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆశిష్ విద్యార్థి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ఒకానొక సమయంలో బీ గ్రేడ్ సినిమాల్లో నటించాను అని తెలిపారు. ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తితో కలిసి బి గ్రేడ్ చిత్రాలలో కూడా నటించాను అని చెప్పారు. ఆ సమయంలో అవకాశాలు రాలేదు. దాంతో ఆదాయం తగ్గిపోయింది. పొట్టకూటి కోసం ఆ సినిమాలు చేయక తప్పలేదు అని చెప్పాడు. అలాగే ఆ సినిమాల్లో నటించడం నాకు తీవ్రమైన బాధను కలిగించింది. కానీ ఏం చేద్దాం.. ఆ సమయంలో ఏం చేయాలో దిక్కుతోచలేదు. వేరే సినిమాలలో అవకాశాలు రాలేదు అని చెప్పుకొచ్చారు ఆశిష్ విద్యార్థి. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.