Pawan Kalyan: ప‌వ‌న్‌కు కొత్త పేరు పెట్టిన బండ్ల గ‌ణేశ్‌.. ఇక‌పై త‌న అభిమాన హీరోను ఎమ‌ని పిల‌వ‌నున్నాడో తెలుసా?

Pawan Bandla Ganesh: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొత్త సినిమా వ‌స్తుందంటే సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను అమితంగా ఆరాధించే వారిలో...

Pawan Kalyan: ప‌వ‌న్‌కు కొత్త పేరు పెట్టిన బండ్ల గ‌ణేశ్‌.. ఇక‌పై త‌న అభిమాన హీరోను ఎమ‌ని పిల‌వ‌నున్నాడో తెలుసా?
Pawan Kalyan Bandla Ganesh

Edited By:

Updated on: Jun 29, 2021 | 1:20 PM

Pawan Kalyan – Bandla Ganesh: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొత్త సినిమా వ‌స్తుందంటే సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను అమితంగా ఆరాధించే వారిలో న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేశ్ ఒక‌రు. ఏ చిన్న సంద‌ర్భంగా దొరికినా స‌రే ప‌వ‌న్‌పై త‌న‌కున్న అభిమానాన్ని బ‌హిర్గ‌తం చేస్తుంటాడు బండ్ల గ‌ణేశ్‌. త‌నను తాను ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు భ‌క్తుడిగా చెప్పుకునే బండ్ల గ‌ణేశ్ తాజాగా ట్విట్ట‌ర్‌లో ఆస‌క్తికర‌మైన పోస్ట్ చేశాడు.

త‌న అభిమాన హీరో పేరును మారుస్తూ ట్వీట్ చేశాడు. ఈ సంద‌ర్భంగా గ‌ర్బ‌ర్ సింగ్ స‌మ‌యంలో ప‌వ‌న్‌తో దిగిన ఫొటోను షేర్ చేసిన బండ్ల గ‌ణేశ్‌.. `నా దేవర తో నేను భక్త కన్నప్ప పరమేశ్వరడుని దేవర అని పిలుచుకునేవారు నేను కూడా ఈరోజు నుంచి నా బాస్ ని దేవర అని పిలుస్తాను` అంటూ రాసుకొచ్చాడు. బండ్ల గ‌ణేశ్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఈ ట్వీట్‌ను ఇప్పుడు తెగ వైర‌ల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఓవైపు రాజ‌కీయాల్లో క్రీయాశీల‌కంగా ఉంటూనే మ‌రోవైపు వ‌రుస సినిమాల‌కు సైన్ చేస్తూ ప‌వ‌న్ త‌న అభిమానుల్లో జోష్ నింపిన విష‌యం తెలిసిందే.

బండ్ల గ‌ణేశ్ చేసిన ట్వీట్‌..

Also Read: Ram Gopal Varma: పుట్టిన ప్రతిజీవికి మరణం తప్పదంటూ ఆర్జీవీ ఫిలాసఫీ.. తనకు ఎలాంటి చావు కావాలో చెప్పిన వైనం

Hara Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ హర హర వీరమల్లు షూటింగ్ లీక్ వీడియో .. సోషల్ మీడియాలో వైరల్

Tollywood: క‌రోనా క‌ల్లోలంలో కంప్లీట్ అయిన సినిమాల‌కు కొత్త టెన్ష‌న్.. ఇదేం స‌మ‌స్య గురూ!