AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: క‌రోనా క‌ల్లోలంలో కంప్లీట్ అయిన సినిమాల‌కు కొత్త టెన్ష‌న్.. ఇదేం స‌మ‌స్య గురూ!

ఆల్రెడీ కోవిడ్ కారణంగా ఎంతో కొంత నష్టాలను చవిచూసిన సినిమాలకు ఇప్పుడు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. లాక్‌డౌన్‌ టైమ్‌లో కొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్ కావటంతో..

Tollywood: క‌రోనా క‌ల్లోలంలో కంప్లీట్ అయిన సినిమాల‌కు కొత్త టెన్ష‌న్.. ఇదేం స‌మ‌స్య గురూ!
Upcoming Telugu Movies
Ram Naramaneni
|

Updated on: Jun 29, 2021 | 12:06 AM

Share

ఆల్రెడీ కోవిడ్ కారణంగా ఎంతో కొంత నష్టాలను చవిచూసిన సినిమాలకు ఇప్పుడు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. లాక్‌డౌన్‌ టైమ్‌లో కొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్ కావటంతో.. ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్న సినిమాలు అదే బాటలో నడిచే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. స్టార్‌ హీరో సల్మాన్‌ రాధే ఓటీటీలో రిలీజ్ అయిన తరువాత… మిగిలిన టాప్‌ హీరోలు కూడా అదే బాటలో నడుస్తారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా టాలీవుడ్ హీరోలకు కూడా ఈ ఇబ్బందులు తప్పటం లేదు. ముఖ్యంగా షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ చేసుకున్న సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేస్తారన్న న్యూస్ వైరల్ అవుతోంది. రీసెంట్గా వెంకటేష్ నారప్ప విషయంలో ఇలాంటి ప్రచారమే జరిగింది. దీంతో నిర్మాత స్పందించి… నారప్ప యాక్షన్‌ థియేటర్లోనే అని క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.

మరో దగ్గుబాటి హీరో రానాకి కూడా ఈ ఇబ్బందులు తప్పటం లేదు. చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న విరాటపర్వం సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారన్న న్యూస్‌ వైరల్ అయింది. దీంతో స్వయంగా దర్శకుడే తమ సినిమా థియేటర్లలోనే రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. పాన్ఇండియా సినిమాలకు కూడా ఇలాంటి రూమర్స్ బెడద తప్పటం లేదు. లాంగ్ డిలేయిడ్ రాధేశ్యామ్‌ ఓటీటీ రిలీజ్ అన్న న్యూస్ చాలా సార్లు వినిపించింది. మేకర్స్ ఎన్ని సార్లు క్లారిటీ ఇచ్చినా మళ్లీ అవే వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకే థియేటర్ల గేట్లు తెరుచుకుంటే గానీ ఈ రూమర్స్‌కు చెక్‌ పడదంటున్నారు విశ్లేషకులు.

Also Read: గ్లోబల్ స్టార్‌గా ఎదిగినా.. తాను ప‌క్కా లోక‌ల్ అంటున్న ప్రియాంక

 ఎగ్జామ్స్‌కు అటెండ్ అయిన మ‌హాన‌టి.. అవేంటో తెలుసుకుందాం పదండి

బన్నీ సినిమాలో కొంచెం ఉంటే బూతు పాట అయిపోయేది..
బన్నీ సినిమాలో కొంచెం ఉంటే బూతు పాట అయిపోయేది..
భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?
రూ.15 కోట్ల రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన హీరో.. ఎందుకంటే..
రూ.15 కోట్ల రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన హీరో.. ఎందుకంటే..
ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పనసకు దూరంగా ఉండటమే మేలు!
ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పనసకు దూరంగా ఉండటమే మేలు!