యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ ప్రస్తుతం వైవిధ్యభరితమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవల నాంది సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తర్వాత.. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఉగ్రం. ఈ చిత్రానికి డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమాను సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ టీజర్ ను బుధవారం విడుదల చేశారు. ఈ చిత్రం టీజర్ లాంచ్ వేడుకకు అక్కినేని నాగచైతన్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ వేడుకలో అల్లరి నరేష్ తన తదుపరి మూవీస్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
అక్కినేని నాగార్జున సినిమాలో అల్లరి నరేష్ కీలకపాత్రలో నటించనున్నట్లుగా కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ ప్రచారం పై స్పందించారు నరేష్. అక్కినేని నాగార్జున ఇటీవల ది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం నాగ్… రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ తెరకెక్కించనున్న సినిమాలో నటించనున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ స్టార్ట్ కాబోతుంది. ప్రస్తుతం ప్రసన్న కుమార్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలకపాత్రలో నటించనున్నారని ప్రచారం నడుస్తోంది.
తాజాగా ఉగ్రం టీజర్ లాంచ్ వేడుకలో నాగార్జున సినిమా గురించి అడగ్గా.. నరేష్ మాట్లాడుతూ.. నిజానికి తనను ప్రసన్న కుమార్ కలిసారని.. అయితే తమ మధ్య ప్రస్తుతం కొన్ని డిస్కషన్స్ జరుగుతున్నాయని.. ఒకవేళ ఫైనలైజ్ అయితే తప్పకుండా న్యూస్ అపీషియల్ గా అనౌన్స్ చేస్తామని అన్నారు అల్లరి నరేష్. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.