
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ ఇతర హీరోల మాదిరిగా కాదు. చాలా డిఫరెంట్. అజిత్ కు సినిమాలతో పాటు కార్ రేసింగ్ అంటే చాలా మక్కువ. అందుకే రెండింటికీ సరైన సమయం కేటాయిస్తున్నాడీ సీనియర్ హీరో. సినిమాల ద్వారా అతను సంపాదించే డబ్బుతో ఖరీదైన కార్లను కొంటాడు. ఇప్పుడు అతని కార్ల కలెక్షన్‌లో మరో విలాసవంతమైన కారు కూడా చేరింది. అవును, అజిత్ కుమార్ మెక్‌లారెన్ సెన్నా కారు కొన్నాడు. ఇది లిమిటెడ్ ఎడిషన్ అలాగే ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్. అందుకే మెక్‌లారెన్ సెన్నా కారు ధర చాలా ఖరీదైనది. అజిత్ కుమార్ మేనేజర్ సురేష్ చంద్ర ఈ కారు ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అజిత్ కుమార్ మెక్‌లారెన్ సెన్నా కారు ముందు గర్వంగా పోజులిచ్చాడు. అజిత్ కుమార్ కొన్న మెక్‌లారెన్ సెన్నా కారు ఆకర్షణీయంగా ఉంది. ఎరుపు, వెండి రంగుల్లో ఉన్న ఆ కారు ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ కారును భారతదేశంలో కొనలేము. అందుకే దీనిని విదేశాల నుంచి కొనుగోలు చేశారు. ఈ కారు ధర సుమారు 6.75 కోట్ల రూపాయలు. ఈ క్రమంలో ఖరీదైన కారును సొంతం చేసుకున్నందుకు అభిమానులు అజిత్ కుమార్‌కు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అజిత్ కుమార్ వద్ద ఉన్న రెండవ అత్యంత ఖరీదైన కారు మెక్‌లారెన్ సెన్నా. దీనికి ముందు, అతను ఫెరారీ SF90 కారును కొన్నాడు. దాని ధర సుమారు 9 కోట్ల రూపాయలు. అజిత్ కుమార్‌కు రేసింగ్ కార్లపై ఎంత క్రేజ్ ఉందో ఇదొక ఉదాహరణ. ఈ హీరోకు సొంత రేసింగ్ జట్టు ఉన్న సంగతి తెలిసిందే.
Senna brought to life with Ajith Kumar bringing the Mc Laren Senna home! pic.twitter.com/fexdJ9c27d
— Suresh Chandra (@SureshChandraa) June 4, 2025
అజిత్ కుమార్ ఇప్పటికే అనేక రేసుల్లో పాల్గొని ట్రోఫీలు గెలుచుకున్నాడు. సినిమా పనులు చూసుకుంటూనే రేసింగ్ కోసం కూడా సమయం కేటాయిస్తున్నాడు. ప్రస్తుతం పారిస్ లో జరిగే ఓ కార్ రేస్ కోసం తలా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం అజిత్ పద్మ భూషణ్ అవార్డును కూడా అందుకున్నాడు.