Adivi Sesh: ఆ ఒక్క కారణంతో 8 బాలీవుడ్ సినిమాలు రిజెక్ట్ చేసిన అడివి శేష్.. ఎందుకంటే..

న్యాచురల్ స్టార్ నాని నిర్మించిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ హిట్ 2 డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా శేష్ నటనకు ప్రశంసలు వస్తున్నాయి.

Adivi Sesh: ఆ ఒక్క కారణంతో 8 బాలీవుడ్ సినిమాలు రిజెక్ట్ చేసిన అడివి శేష్.. ఎందుకంటే..
Actor Adivi Sesh

Updated on: Dec 02, 2022 | 7:33 PM

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ హిట్ 2 సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇటీవల మేజర్ మూవీతో పాన్ ఇండియా స్టార్‏గా క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు శేష్. వైవిధ్యమైన కాన్సెప్ట్… కంటెంట్ ప్రాధాన్యత చిత్రాలను ఎంచుకుంటూ తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆయన ప్రధాన పాత్రలో న్యాచురల్ స్టార్ నాని నిర్మించిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ హిట్ 2 డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా శేష్ నటనకు ప్రశంసలు వస్తున్నాయి.

అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా శేష్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మేజర్ సినిమా అనంతరం తాను బాలీవుడ్ నుంచి వచ్చిన 8 ప్రాజెక్ట్స్ రిజెక్ట్ చేసినట్లు చెప్పుకొచ్చారు. తనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో కమిట్ అయిన సినిమాలు ఉండడం వలన బీటౌన్ చిత్రాలకు సైన్ చేయడానికి నిరాకరించినట్లు తెలిపారు. హిట్ 2తో సహా తన రాబోయే సినిమాలు హిందీలో కూడా విడుదల చేస్తామని హామీ ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

హిట్ 2 అనంతరం రాబోతున్న హిట్ 3లోనూ అడివి శేష్ కనిపించనున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా .. ఆయన నటించనున్న గూఢాచారి సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేయడానికి కనీసం 6 నెలల సమయం పడుతుందని తెలిపాడు.