Vishal: వరుస సినిమాలతో బిజీగా స్టార్ హీరో.. మరో యాక్షన్ ఎంటర్టైనర్‌ను లైన్‌లో పెట్టిన విశాల్..

|

Sep 01, 2021 | 4:47 PM

యాక్ష‌న్ హీరో విశాల్ ఎ. వినోద్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక హై ఆక్టేన్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో న‌టించ‌నున్నారు. ఇటీవల  విశాల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ మూవీ చెన్నైలోని

Vishal: వరుస సినిమాలతో బిజీగా స్టార్ హీరో.. మరో యాక్షన్ ఎంటర్టైనర్‌ను లైన్‌లో పెట్టిన విశాల్..
Follow us on

Vishal: యాక్ష‌న్ హీరో విశాల్ ఎ. వినోద్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక హై ఆక్టేన్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో న‌టించ‌నున్నారు. ఇటీవల  విశాల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ మూవీ చెన్నైలోని ప్ర‌సిద్ద సాయిబాబా దేవాల‌యంలో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ఇక ప్ర‌స్తుతం ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకుంటోంది. రానా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ర‌మ‌ణ‌, నంద సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో విశాల్‌కు జోడీగా సునైన‌ నటిస్తోంది. ఈ సినిమాకోసం మేక‌ర్స్ ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌ను క‌న్ఫ‌ర్మ్ చేసే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. సమాజంలో పెద్ద మార్పు తీసుకురావడాన్ని ప్రభావితం చేసే అంశం ఆధారంగా ఈ సినిమా రూపొందుతుందని తెలుస్తుంది. ఈ సినిమాకు అన్ని భాషలకు ఒకే టైటిల్ ఉండ‌నుందని సమాచారం. అతి త్వ‌ర‌లో టైటిల్‌ను ప్ర‌క‌టించ‌నున్నారు.

విశాల్ ఇప్ప‌టికే ఎన్నో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌లో న‌టించారు. అయితే ఈ సినిమా వాటికి భిన్నంగా ఉండ‌నుంది. ఈ మూవీలో యాక్ష‌న్ సీక్వెన్సెస్ త‌ప్ప‌కుండా ప్రేక్షకులను అల‌రించ‌నున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా సెకండాఫ్‌లో 45 నిమిషాల నిడివిగ‌ల యాక్ష‌న్ సీక్వెన్స్‌లు ఉండ‌డం విశేషం. స్టంట్ డైరెక్ట‌ర్ దిలీప్ సుబ్బ‌రాయ‌న్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఈ స్టంట్స్ జ‌ర‌గ‌నున్నాయి. ఈ సినిమా పై విశాల్ తోపాటు చిత్రయూనిట్ అంతా ధీమాగా ఉన్నారు. మరో వైపు విశాల్ ఎనిమి అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో విలన్‌గా విశాల్ ఫ్రెండ్, హీరో ఆర్య నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Aadi Saikumar: ”అతిథి దేవోభవ” అంటున్న ఆది సాయి కుమార్.. ఆకట్టుకుంటున్న పోస్టర్..

భీమ్లా నాయక్ పుట్టినరోజుకు ముందుగానే పెద్ద ఎత్తున సందడి చేస్తున్న అభిమానులు..

 తాళిబొట్టుతో ఫోటోషూట్ చేసిన గ్లోబల్ స్టార్.. కుర్రాళ్ల మతిపొగొడుతున్న ప్రియాంక.. నెట్టింట్లో ఫోటోలు వైరల్..

Tollywood drug case: అప్రూవర్‌గా మారిన కెల్విన్.. టాలీవుడ్‌లో ప్రకంపనలు.. వారి బ్యాంక్‌ అకౌంట్స్‌ని ఫ్రీజ్!