AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : ఇదెక్కడి రెస్పాన్స్ రా.. 10 రోజుల్లోనే రూ.25 కోట్లు.. థియేటర్లలో దుమ్మురేపుతున్న చిన్న సినిమా..

ప్రస్తుతం ఒక చిన్న థియేటర్లలో దుమ్మురేపుతుంది. అందమైన ప్రేమకథ యూత్ కు తెగ కనెక్ట్ అయ్యింది. అందుకే ఈ ఈ చిత్రానికి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. కేవలం 10 రోజుల్లోనే రూ.25 కోట్లు వసూలు చేసినట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. ఇప్పటికీ ఇంకా ఈ మూవీ దూసుకుపోతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. ?

Cinema : ఇదెక్కడి రెస్పాన్స్ రా.. 10 రోజుల్లోనే రూ.25 కోట్లు.. థియేటర్లలో దుమ్మురేపుతున్న చిన్న సినిమా..
With Love
Rajitha Chanti
|

Updated on: Feb 17, 2026 | 9:58 AM

Share

టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో దర్శకుడిగా తెరంగేట్రం చేశాడు అభిషన్ జీవింద్. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. దర్శకుడిగా సక్సెస్ అయిన అతడు ఇప్పుడు హీరోగానూ భారీ విజయాన్ని అందుకున్నాడు. అభిషన్ జీవింద్ హీరోగా పరిచయమైన మూవీ విత్ లవ్. ఈ చిత్రంలో మలయాళ నటి అనశ్వర రాజన్ కథానాయికగా నటించింది. ఈ చిత్రాన్ని అభిషన్ జీవింద్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన మధన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని రజనీకాంత్ కుమార్తె సౌందర్య నిర్మించగా.. సీన్ రోల్డాన్ సంగీతం అందించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా థియేటర్లలో విడుదలైంది.

మొదటి రోజు నుంచే ఈ చిత్రానికి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. తొలి రోజు 2 కోట్లకు పైగా వసూలు చేసింది. సినిమా విడుదలైన 10 రోజులకు రూ. 25 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. అంతేకాదు. ఇప్పటికీ థియేటర్లలో ఈ సినిమా హావా నడుస్తుంది. మరో నాలుగైదు రోజుల్లో ఈ చిత్రానికి రూ.50 కోట్లు రావడం ఖాయమని తెలుస్తోంది. అలాగే తొలి చిత్రంతోనే అభిషన్ జీవింద్ హీరోగా కూడా తనదైన ముద్ర వేశాడు.

నేటి యువత ప్రేమను దృష్టిలో ఉంచుకుని కామెడీగా తెరకెక్కిన ఈ మూవీ యూత్ కు ఎక్కువగా కనెక్ట్ అయ్యింది. తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మంచి వసూల్లు రాబడుతుంది.

Follow Us