Laal Singh Chaddha : థియేటర్లలో అడుగుపెట్టిన లాల్‌సింగ్‌ చడ్డా.. ఆమిర్‌, చైతూల సినిమా టాక్ ఎలా ఉందంటే?

|

Aug 11, 2022 | 11:00 AM

Laal Singh Chaddha Twitter Review: బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ఖాన్‌ నాలుగేళ్ల విరామం తర్వాత నటించిన చిత్రం లాల్‌సింగ్‌ చడ్డా (Laal Singh Chaddha). అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) కీలక పాత్రలో కనిపించాడు.

Laal Singh Chaddha : థియేటర్లలో అడుగుపెట్టిన లాల్‌సింగ్‌ చడ్డా.. ఆమిర్‌, చైతూల సినిమా టాక్ ఎలా ఉందంటే?
Laal Singh Chaddha
Follow us on

Laal Singh Chaddha Twitter Review: బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ఖాన్‌ నాలుగేళ్ల విరామం తర్వాత నటించిన చిత్రం లాల్‌సింగ్‌ చడ్డా. అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) కీలక పాత్రలో కనిపించాడు. కరీనా కపూర్‌ ఆమిర్‌ సరసన హీరోయిన్‌గా నటించింది. ఆస్కార్‌ విన్నింగ్‌ ఫిల్మ్‌ ఫారెస్ట్‌ గంప్‌ కు హిందీ రీమేక్‌గా వస్తున్న ప్రముఖ దర్శకుడు అద్వెత్‌ చందన్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. వయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్‌, ఆమిర్ ఖాన్ ప్రొడ‌క్షన్స్‌ పతాకంపై ఆమిర్ ఖాన్, కిర‌ణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇక తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) ఈ సినిమాను సమర్పిస్తుండడంతో తెలుగులో కూడా లాల్‌సింగ్‌ పై ఆసక్తి పెరిగింది. దీనికి తోడు రిలీజ్‌ అయిన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. ఇలా భారీ అంచనాల మధ్య నేడు (ఆగస్టు11)న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు లాల్‌సింగ్‌ చడ్డా. ఇప్పటికే ఓవర్సీ్‌తో పాటు పలు చోట్ల షోస్ పడ్డాయి. దీంతో ఈ సినిమా చూసిన ఫ్యాన్స్‌, ప్రేక్షకులు నెట్టింట తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మరి లాల్‌సింగ్‌ సినిమా ఎలా ఉందో, చైతూ బాలీవుడ్‌ డెబ్యూ ఎలా ఉందో ట్విట్టర్‌ రివ్యూలో తెలుసుకుందాం రండి.

హృదయాన్ని హత్తుకునే చడ్డా..

ఇవి కూడా చదవండి

‘లాల్‌సింగ్‌ చడ్డా’ బ్యూటీఫుల్‌ ఫిల్మ్‌. కచ్చితంగా థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా ఇది. లాల్‌సింగ్‌గా ఆమిర్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అద్వెత్‌ చందన్‌ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు’ అని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. 3 ఇడియట్స్ తరువాత హిందీలో మళ్లీ ఆమిర్ నుంచి ఓ మంచి సినిమా వచ్చింది. హృదయాన్ని హత్తుకునేలా లాల్ సింగ్ చడ్డా సినిమా ఉంది..అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఫస్టాప్‌ బాగుందని, ఇంటర్వెల్‌ సీన్స్ అదిరిపోయాయని, ఇక సెకండ్‌ హాఫ్‌ మంచి వినోదంతో పాటు ఎమోషనల్‌ టచ్‌తో లాల్‌సింగ్‌ ఆకట్టుకున్నాడని నెటిజన్లు చెబుతున్నారు. సినిమాలో కరీనా, చైతూల నటన కూడా బాగుందంటూ పాజిటివ్‌ రిపోర్ట్స్‌ వస్తున్నాయి. మరి ఇప్పటికే హిట్‌ టాక్‌ సొంతం చేసుకున్న లాల్‌సింగ్‌ లాంగ్‌ రన్‌లో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో వెయిట్‌ అండ్‌ సీ..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..