Aadi Sai Kumar: ఆ టాప్ డైరెక్టర్‌తో సినిమా.. వర్కవుట్ కాలేదు.. పడుంటే వేరేలా ఉండేది.. హీరో ఆది సాయికుమార్..
నటుడు ఆది సాయికుమార్ ఇటీవలే శంభాల సినిమాతో హిట్టు అందుకున్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత అడియన్స్ ముందుకు వచ్చిన ఆది.. ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టాడు. శంబాల సినిమా ప్రమోషన్లలో భాగంగా తన లైఫ్, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. అలాగే ఓ టాప్ డైరెక్టర్ తో సినిమా మిస్సైందని అన్నారు.

టాలీవుడ్ ఆదిసాయికుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సాయి కుమార్ తనయుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మొదట్లో వరుస హిట్స్ అందుకున్న ఆది.. ఆ తర్వాత ప్లాపులు రావడంతో సినిమాలకు దూరమయ్యారు. ఇటీవలే శంబాల సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా ప్రమోషనల్లో భాగంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇటీవల పూరి జగన్నాథ్‌తో కలిసి సినిమా చేయాలని భావించినప్పటికీ, అది కొన్ని లాజిస్టికల్ కారణాల వల్ల కార్యరూపం దాల్చలేదని వెల్లడించారు. పూరి జగన్నాథ్ తన “లవ్లీ” సినిమా పాటలు చూసి, తన ఎనర్జీని మెచ్చుకొని తన తండ్రి సాయికుమార్‌కు మెసేజ్ చేశారని ఆది తెలిపారు. ఆ సమయంలో తామిద్దరూ కలిసి సినిమా చేయాలనుకున్నామని, కానీ అది వర్కౌట్ కాలేదని వివరించారు.
పూరి జగన్నాథ్ తనకు నేరుగా మెసేజ్ చేయలేదని, అయితే తన “లవ్లీ” సినిమాలోని పాటలు చూసి తన ఎనర్జీని గుర్తించి తన తండ్రి సాయికుమార్ గారికి మెసేజ్ చేశారని వివరించారు. ఆ సమయంలో పూరి జగన్నాథ్ తనలో అసాధారణమైన ఎనర్జీ ఉందని మెచ్చుకున్నారని, ఇద్దరం కలిసి సినిమా చేయాలనుకున్నప్పటికీ, లాజిస్టికల్ కారణాల వల్ల అది సాధ్యం కాలేదని ఆది స్పష్టం చేశారు. పెద్ద డైరెక్టర్లతో పని చేసే అవకాశాలు మిస్ అయినందుకు తాను పశ్చాత్తాపపడడం లేదని, ఎందుకంటే వారు ఎప్పుడూ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉంటారని ఆయన పేర్కొన్నారు. అయితే, తాను వదులుకున్న కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయని కూడా ఆది తెలిపారు.
అలాగే, తన తండ్రి, నటుడు సాయికుమార్ ప్రస్థానం తనకెంతో స్ఫూర్తిదాయకమని ఆది పేర్కొన్నారు. సాయికుమార్ సినిమాను ప్రాణంగా ప్రేమిస్తారని, 50 ఏళ్లుగా అదే అంకితభావం, ఉత్సాహంతో కొనసాగుతున్నారని కొనియాడారు. ఆయన ఎంతో సహనం, సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తి అని తెలిపారు. తన తండ్రి సాయికుమార్ నటించిన “పోలీస్ స్టోరీ”, “లోనాడర్”, “ప్రస్థానం”, “రంగితరంగా”, “సామాన్యుడు” వంటి చిత్రాలు తనకెంతో ఇష్టమని ఆది వెల్లడించారు. “పోలీస్ స్టోరీ” వంటి క్లాసిక్ చిత్రాలను రీమేక్ చేయకూడదని అభిప్రాయపడ్డారు. త్వరలోనే తాను, తన తండ్రి సాయికుమార్ కలిసి ఒక సినిమాలో నటించబోతున్నట్లు ఆది సాయికుమార్ పంచుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Prabhas: ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది.. ఆరోజు రాత్రి.. డార్లింగ్ బెస్ట్ ఫ్రెండ్ కామెంట్స్..
ఎక్కువ మంది చదివినవి : Child Artist: షూటింగ్లో యాక్సిడెంట్.. 2 ఏళ్లు నరకం అనుభవించా.. సూర్యవంశం చైల్డ్ ఆర్టిస్ట్..
