Actress Sreeleela: పాపం పంజా బాబు.. శ్రీలీలతో డ్యాన్స్ అంటే అలా ఉంటుంది మరి..!

| Edited By: Rajeev Rayala

Oct 28, 2023 | 9:44 AM

అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, నితిన్, రామ్ ఇలా ఏ హీరోని తీసుకున్న డాన్స్ లో ఎవరి స్టైల్ వాళ్లకు ఉంది. వాళ్లతో కొత్త కొత్త స్టెప్పులు వాయిస్తూ కొరియోగ్రాఫర్స్ కూడా బాగానే హైలైట్ అవుతున్నారు. అయితే హీరోయిన్ల విషయానికి వచ్చేసరికి మాత్రం చాలా మంది డాన్సులలో వెనక పడుతున్నారు. హీరోలు పక్కనుంటే మనని ఎవరు చూస్తారులే అని పెద్దగా కాన్సన్ట్రేట్ చేయడం లేదు.

Actress Sreeleela: పాపం పంజా బాబు.. శ్రీలీలతో డ్యాన్స్ అంటే అలా ఉంటుంది మరి..!
Aadikeshava
Follow us on

తెలుగు ఇండస్ట్రీలో హీరోల అందరికీ దాదాపు డాన్స్ వస్తుంది. ఎవరో ఒకరిద్దరూ మేనేజ్ చేస్తారు తప్ప చాలామంది మంచి డాన్సర్స్ ఉన్నారు మన దగ్గర. అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, నితిన్, రామ్ ఇలా ఏ హీరోని తీసుకున్న డాన్స్ లో ఎవరి స్టైల్ వాళ్లకు ఉంది. వాళ్లతో కొత్త కొత్త స్టెప్పులు వాయిస్తూ కొరియోగ్రాఫర్స్ కూడా బాగానే హైలైట్ అవుతున్నారు. అయితే హీరోయిన్ల విషయానికి వచ్చేసరికి మాత్రం చాలా మంది డాన్సులలో వెనక పడుతున్నారు. హీరోలు పక్కనుంటే మనని ఎవరు చూస్తారులే అని పెద్దగా కాన్సన్ట్రేట్ చేయడం లేదు. కానీ ఒకరు ఇద్దరు హీరోయిన్లు మాత్రం తమ డాన్స్ లతో సినిమాలను నిలబెడుతున్నారు.

ఈ లిస్టులో నెంబర్ వన్ సాయి పల్లవి అయితే.. నెంబర్ 2 శ్రీలీల. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో ఈమె ది బెస్ట్ డాన్సర్. శ్రీలీల సినిమాలో ఉంది అంటే కొరియోగ్రాఫర్లకు ఫుల్ వర్క్ ఉంటుంది. ఆమెతో ఎలాంటి స్టెప్ వేయించాలా అని ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు. పైగా హీరోలు కూడా శ్రీలీలతో డాన్స్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటున్నారు. ఏమాత్రం తగ్గిన స్క్రీన్ మీద ఆమె కనిపించకుండా చేస్తుందని వాళ్లకు బాగా తెలుసు. అందుకే వాళ్ళు కూడా ఫుల్ రిహార్సల్ చేసి మరీ వస్తున్నారు. రామ్ లాంటి హీరోలకు అయితే పర్లేదు కానీ.. వైష్ణవ్ తేజ్ లాంటి యంగ్ హీరోలు మాత్రం శ్రీలీల ముందు తేలిపోతున్నారు.

తాజాగా ఆది కేశవ సినిమా నుంచి మరో పాట విడుదలైంది. ఇంతకు ముందు విడుదలైన రెండు పాటల్లో కూడా శ్రీలీల డాన్స్ ముందు మెగా మేనల్లుడు పెద్దగా హైలైట్ అవ్వలేదు. ఇక ఇప్పుడు మూడో పాట పూర్తిగా మాస్. అందులో స్టెప్పులు ఇరగదీసింది శ్రీలీల. పాటలో ఆమె ఎనర్జీ చూసిన తర్వాత అమ్మో అనుకోకుండా ఉండలేరు. పైగా ఈ పాట కూడా ఆమె పేరు మీదే మొదలైంది. లీలమ్మో లీలమ్మ అంటూ సాగే ఈ పాటను కాసర్ల శ్యామ్ రాయగా.. నకాష్ అజీజ్ పాడాడు. జీవి ప్రకాష్ సంగీతం అందించిన ఈ పాట ఇన్స్టెంట్ హిట్ అయింది.

నవంబర్ 10న ఈ సినిమా విడుదల కానుంది. దీపావళికి రాబోయే క్రేజీ తెలుగు సినిమా ఇదే. అదే రోజు వర్మ వ్యూహం కూడా విడుదలవుతుంది. ఇదిలా ఉంటే ఆదికేశవపై అంచనాలు పెరగడంలో శ్రీ లీల పాత్ర కూడా ఉంది. ఆమె ఉంది కాబట్టి సినిమాకు వచ్చే ప్రేక్షకులు చాలానే ఉంటారు. ఇక డాన్స్ లలో కూడా దుమ్ము దులిపేస్తుంది కాబట్టి సినిమాకు మినిమం గ్యారెంటీ ఖాయం. మరోవైపు ఉప్పెన తర్వాత సరైన సక్సెస్ లేని వైష్ణవ్ తేజ్ ఆశలన్నీ ఆదికేశవ సినిమా మీద ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.