
సీతారామం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సొంతం చేసుకుంది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. అప్పటివరకు హిందీలో పలు చిత్రాల్లో నటించిన ఈ హీరోయిన్‌కు.. డైరెక్టర్ హానురాఘవపూడి తెరకెక్కించిన ఈ సినిమాతో ఒక్కసారిగా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇందులో సీతామహాలక్ష్మి పాత్రలో తెలుగు ప్రేక్షకుల మనసులలో చెరగని స్థానం సొంతం చేసుకుంది. మృణాల్ కెరీర్లోనే భారీ విజయాన్ని అందుకున్న సినిమాగా సీతారామం చిత్రం నిలిచింది. ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని సరసన ఓ ప్రాజెక్ట్ చేస్తుంది. ఈ చిత్రానికి శౌర్యువ్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అటు వరుస చిత్రాలతో బిజీగా ఉన్న మృణాల్.. ఇటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్. నిత్యం రీల్స్, ఫోటోస్ అంటూ నెట్టింట రచ్చ చేస్తుంటుంది. తాజాగా సోషల్ మీడియాలో మృణాల్‌కు ఓ అభిమాని పెళ్లి ప్రపోజల్ చేశాడు.
వైట్ డ్రెస్ ధరించి ఎంతో అందంగా చిరునవ్వులు చిందిస్తూ ఓ స్పెషల్ వీడియోనూ తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈ వీడియో క్షణాల్లోనే తెగ వైరలయ్యింది. ఈ వీడియోకు ఓ అభిమాని.. నిన్ను పెళ్లి చేసుకోవడానికి నా సైడ్ నుంచి ఓకే అంటూ కామెంట్ చేశాడు. ఇది చూసిన మృణాల్ నా సైడ్ నుంచి మాత్రం కాదు అంటూ సరదాగా రిప్లై ఇచ్చింది. మృణాల్ తన కామెంట్ కు రిప్లై ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాడు నెటిజన్.
Mrunal
మృణాల్ చివరిసారిగా సెల్ఫీ అనే హిందీ చిత్రంలో కనిపించింది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఫిబ్రవరి 24న విడుదలైంది. మలయాళ చిత్రం డ్రైవింగ్ లైసెన్స్ కు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఒరిజినల్ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, సూరజ్ వెంజరమూడు పోషించిన పాత్రలను అక్షయ్, ఇమ్రాన్ నటించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.