National Film Awards Winners: 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించిన కేంద్రం.. ఉత్తమ చిత్రంగా భగవంత్ కేసరి

71 జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది ప్రతిభ కనబరిచిన నటులకు, దర్శకులకు, చిత్రాలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు/నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ సహాయ నటుడు/నటి, ఉత్తమ బాల నటుడు, ఉత్తమ రచయిత, ఉత్తమ సాంకేతిక విభాగాలకు అవార్డులను ప్రకటించింది కేంద్రం.

National Film Awards Winners: 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించిన కేంద్రం.. ఉత్తమ చిత్రంగా భగవంత్ కేసరి
National Film Awards

Updated on: Aug 01, 2025 | 7:30 PM

ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చలన చిత్రాల్లో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న సినిమాలకు అవార్డులు అనౌన్స్ చేశారు. ఈ అవార్డులను డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ (DFF) నిర్వహిస్తుంది. 1954లో ప్రారంభమైన ఈ అవార్డులు సినిమాల్లో వైవిధ్యం, సృజనాత్మకత, సాంస్కృతిక ప్రాముఖ్యత బట్టి అందజేస్తారు. తాజాగా 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రభుత్వం అనౌన్స్ చేసింది. 2023లో విడుదలైన సినిమాలకు అవార్డులు 71జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది కేంద్రం. 22 భాషల్లో 115 సినిమాలు వీక్షించిన జ్యురీ అవార్డులను అనౌన్స్ చేసింది.

బెస్ట్ తెలుగు మూవీ : భగవంత్ కేసరి, బెస్ట్ తమిళ్ మూవీ : పార్కింగ్ , బెస్ట్ పంజాబీ మూవీ: గొడ్డే గొడ్డే చా, బెస్ట్ ఒడియా మూవీ : పుష్కర్, బెస్ట్ మలయాళం మూవీ: ఉల్లజుకు, బెస్ట్ కన్నడ మువీ : కాండీలు , బెస్ట్ హిందీ మూవీ : కథాల్ , బెస్ట్ గుజరాతీ మూవీ : వాష్ , బెస్ట్ బెంగాలీ మూవీ : డీప్ ఫ్రిడ్జ్, బెస్ట్  యాక్షన్ డైరెక్షన్ : హనుమాన్ ( తెలుగు ). బెస్ట్ సాంగ్ : బలగం ( తెలుగు). బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ : బేబీ మూవీ ( సాయి రాజేష్ ), బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా డైరెక్టర్ సుకుమార్ కూతురు శుకృతి వేణి ఎంపికైంది,  ఉత్తమ నటి : రాణీముఖర్జీ.

బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్: ఉత్పల్ దత్తా (అస్సామి)

ఇవి కూడా చదవండి

నాన్ ఫీచర్ ఫిల్మ్స్ కేటగిరి.. 115 ఫిల్మ్స్ 22 లాంగ్వేజ్, 15 అవార్డ్ కేటగిరీస్

స్పెషల్ మెన్షన్.. క్రానికల్ ఆఫ్ ది ప్యాడీ మ్యాన్ (మలయాళం) ఎమ్ కే రామ్ దాస్
ది సీ అండ్ సెవెన్ విలేజెస్ (ఒడియా).. హమన్షు శేఖ్రా ఖౌతా డైరెక్టర్

బెస్ట్ స్క్రిప్ట్.. సన్ ఫ్లవర్స్ వర్ ది ఫస్ట్ వన్స్ టు నో (కన్నడ) చిదానంద నాయక్

బెస్ట్ వాయిస్ ఓవర్: ది సీక్రేడ్ జాక్ (ఇంగ్లీష్).. ఎక్స్‌ప్లోరింగ్ ది ట్రీ ఆఫ్ విషెస్ (హరికృష్ణన్ ఎస్)

బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: ది ఫస్ట్ ఫిల్మ్ (హిందీ) ప్రాణిల్ దేశాయ్

ఎడిటర్: మూవీంగ్ ఫోకస్ (ఇంగ్లీష్) నీలాద్రి రాయ్

బెస్ట్ సౌండ్ డిజైన్: ధున్దగిరి కే ఫూల్ (హిందీ) శుభరన్ సేన్ గుప్తా

బెస్ట్ సినిమాటోగ్రఫీ: లిటిల్ వింగ్స్ (తమిళ్) శరవణముత్తు సౌందరపాండి, మీనాక్షి సోమన్

బెస్ట్ డైరెక్షన్: ది ఫస్ట్ ఫిల్మ్ (హిందీ) డైరెక్టర్ పియూష్ ఠాకూర్

బెస్ట్ షార్ట్ ఫిల్మ్: గిద్ధ్ ది స్కావేంజర్ (హిందీ) మనిష్ సైని డైరెక్టర్

బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్ ఎన్విరాన్మెంటల్: ది సైలెంట్ ఎకాడిమిక్ (హిందీ) డైరెక్టర్ అక్షత్ గుప్తా

బెస్ట్ డాక్యుమెంటరీ: గాడ్ వల్చర్ అండ్ హ్యూమన్ (ఇంగ్లీష్, తెలుగు, హిందీ) రిషిరాజ్ అగర్వాల్

బెస్ట్ ఆర్ట్స్ కల్చర్ ఫిల్మ్: టైమ్ లెస్ తమిళనాడు (ఇంగ్లీష్) కామాఖ్య నారాయణ్ సింగ్ డైరెక్టర్, నిర్మాత సెలెబ్రిటీస్ మేనేజ్‌మెంట్ ప్రై లిమిటెడ్, సంజిబ్ పరసార్

బెస్ట్ బయోగ్రఫికల్/హిస్టారికల్: మా బౌ మా గాన్ (ఒడియా)

లెంటినా ఓ (ఇంగ్లీష్)

బెస్ట్ డెబ్యూ డైరెక్టర్: మౌ: ది స్పిరిట్ డ్రీమ్స్ ఆఫ్ చ్రౌ (మిజో) శిల్పిక బోర్డోలోయ్

బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్: ఫ్లవరింగ్ మ్యాన్ (హిందీ) సౌమ్యాజిత్ ఘోష్ దాస్టిదార్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.