AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‏తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..

సినీరంగంలో సీనియర్ హీరోలకు కుర్రహీరోయిన్స్ జోడిగా నటిస్తుంటారు. తమకంటే చాలా సంవత్సరాలు చిన్న నటీమణులతో వెండితెరపై ప్రేమకథలు నడిపిస్తుంటారు. కానీ ఓ స్టార్ హీరో మాత్రం తనకంటే 36 సంవత్సరాలు చిన్న వయసు అయిన హీరోయిన్ తో ముద్దు సన్నివేశాల్లో నటించాడు.

Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‏తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..
Black Movie
Rajitha Chanti
|

Updated on: May 10, 2025 | 12:29 PM

Share

సినీరంగంలో ప్రేమకు, పెళ్లికి వయసుతో సంబంధం ఉండదు. పెద్ద వయసు తారలు తమకంటే చిన్న వారితో తెరపై ప్రేమకథలలో నటిస్తుంటారు. ఈ మధ్య కాలంలో సీనియర్ స్టార్స్ జోడిగా కుర్ర హీరోయిన్స్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ సైతం.. ఇద్దరు స్టార్స్ జీవితంలో జరిగిన ఘటనే. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ తనకంటూ చిన్న హీరోయిన్లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అంతేకాదు.. వెండితెరపై అమితాబ్ నటించిన ప్రేమకథలలో అందరూ స్టార్స్ చిన్నవాళ్లే కావడం గమనార్హం. కానీ అమితాబ్ తన కోడలు కాబోయే నటితో సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాడు. ఆ సమయంలో అమితాబ్ వయసు 60 సంవత్సరాలు.

డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ చిత్రం ‘బ్లాక్’లో రాణి ముఖర్జీతో కలిసి పనిచేశాడు. మొదట ఈ సినిమాలో కరీనా కపూర్‌ను తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల కరీనా ఆ సినిమాలో భాగం కాలేకపోయింది. కరీనాతో కలిసి పనిచేయడానికి అమితాబ్ నిరాకరించారని రూమర్స్ వినిపించాయి. ఆ తర్వాత ఈ చిత్రానికి రాణి ముఖర్జీని తీసుకున్నారు. 2005లో విడుదలైన బ్లాక్ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రానికి ఆమెకు ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్, అమితాబ్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్నారు. అయితే ఈ సినిమాలో వాళ్లిద్దరి మధ్య ముద్దు సన్నివేశం ఉంది. దీంతో ఆ సీన్ చూశాక అప్పట్లో అభిమానులు షాకయ్యారు. కానీ ఆ సమయంలో అభిషేక్ బచ్చన్, రాణి ముఖర్జీ ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే వీరిద్దరి పెళ్లి జరగనుందనే ప్రచారం జరిగింది. కానీ కొన్నాళ్లకే ఈ వీరిద్దరి మధ్య బంధం తెగిపోయింది.

రాణి ముఖర్జీ మాత్రమే కాదు, కరిష్మా కపూర్ కూడా ఒకప్పుడు బిగ్ బి కుటుంబానికి కోడలు కావాల్సి ఉంది. అభిషేక్, కరిష్మా నిశ్చితార్థం జరిగింది. కానీ కొన్ని కారణాలతో వీరి బంధం పెళ్లి వరకు చేరలేదు. ఆ తర్వాత అభిషేక్ 2007లో ఐశ్వర్య రాయ్ ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఆరాధ్య అనే కుమార్తె ఉంది.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..

Follow Us
బుధ సంచారం.. ఆ రాశుల వారికి ఇక పట్టిందల్లా బంగారమే..
బుధ సంచారం.. ఆ రాశుల వారికి ఇక పట్టిందల్లా బంగారమే..
మూత్రం పసుపు రంగులో వస్తోందా? ఈ సిగ్నల్‌ను లైట్ తీసుకోవద్దు!
మూత్రం పసుపు రంగులో వస్తోందా? ఈ సిగ్నల్‌ను లైట్ తీసుకోవద్దు!
ఆరోగ్యానికి ఏ నూనె మంచిది..? 90శాతం మందికి ఈ నిజాలు తెలియదు..
ఆరోగ్యానికి ఏ నూనె మంచిది..? 90శాతం మందికి ఈ నిజాలు తెలియదు..
వచ్చే ఎన్నికల్లో నా భార్య మౌనిక పోటీ చేస్తుంది: మంచు మనోజ్
వచ్చే ఎన్నికల్లో నా భార్య మౌనిక పోటీ చేస్తుంది: మంచు మనోజ్
ముఖానికి ఐస్‌ మసాజ్ చేస్తున్నారా?ఈ చిన్న చిట్కాలతో మీ చర్మం
ముఖానికి ఐస్‌ మసాజ్ చేస్తున్నారా?ఈ చిన్న చిట్కాలతో మీ చర్మం
వాషింగ్ మెషీన్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్ సగానికి సగం..
వాషింగ్ మెషీన్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్ సగానికి సగం..
హ్యాపీ రిటైర్మెంట్‌కు PF డబ్బు సరిపోతుందా?
హ్యాపీ రిటైర్మెంట్‌కు PF డబ్బు సరిపోతుందా?
ఏపీ ప్రజలకు తక్కువ ధరకే సరుకులు.. త్వరలో మినీ మార్టులు..
ఏపీ ప్రజలకు తక్కువ ధరకే సరుకులు.. త్వరలో మినీ మార్టులు..
టీమిండియా హెడ్ కోచ్‌పై పరోక్షంగా కోహ్లీ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా హెడ్ కోచ్‌పై పరోక్షంగా కోహ్లీ సంచలన వ్యాఖ్యలు
అగ్గిపెట్టెలాంటి ఇల్లు.. రూ. 66 వేల అద్దె.. బాల్కనీ వ్యూ చూస్తే
అగ్గిపెట్టెలాంటి ఇల్లు.. రూ. 66 వేల అద్దె.. బాల్కనీ వ్యూ చూస్తే