AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khaidi Movie: చిరంజీవి కెరీర్‏కు టర్నింగ్ పాయింట్.. బ్లాక్ బస్టర్ హిట్ ఖైదీ చిత్రాన్ని మిస్ అయిన స్టార్ హీరో ఎవరంటే..

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ మలుపు తిప్పిన సినిమా ఖైదీ. ఈ మూవీ విడుదలై నేటికి 42 సంవత్సరాలు పూర్తయ్యాయి. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ రూపు రేఖలు మార్చిన కల్ట్ క్లాసిక్ మూవీ ఇది. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.

Khaidi Movie: చిరంజీవి కెరీర్‏కు టర్నింగ్ పాయింట్.. బ్లాక్ బస్టర్ హిట్ ఖైదీ చిత్రాన్ని మిస్ అయిన స్టార్ హీరో ఎవరంటే..
Khaidi Movie
Rajitha Chanti
|

Updated on: Oct 28, 2025 | 3:31 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేని ఓ సాధారణ అబ్బాయి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనదైన ముద్ర వేశారు. చిరును మెగాస్టార్ చేసిన సినిమా ఖైదీ. తెలుగు సినిమా ప్రపంచంలో ఈ చిత్రానికి ప్రత్యేక చరిత్ర ఉంది. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఈ మూవీ విడుదలై 42 సంవత్సరాలు పూర్తైంది. 1982 అక్టోబర్ 28న విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా చిరంజీవి కెరీర్ మలుపు తిప్పిన సినిమా ఇది. అప్పట్లోనే మాస్ అటిడ్యూడ్, యాక్షన్ సీక్వెన్స్ లతో ఈ చిత్రాన్ని సరికొత్తగా తెరకెక్కించారు డైరెక్టర్ కోదండరామిరెడ్డి. ఇందులో చిరు యాక్టింగ్, మాస్ మేనరిజం జనాలను ఊర్రూతలూగించాయి. ఈ సినిమా విడుదలై 42 ఏళ్లు పూర్తైన సందర్భంగా చిరంజీవి టీమ్ స్పెషల్ వీడియో విడుదల చేసింది.

“తెలుగు సినిమా చరిత్రలో మార్పు తీసుకొచ్చిన పేరు ఖైదీ” అంటూ షేర్ చేసిన ఆ వీడియోలో చూపించిన సన్నివేశాలు అభిమానుల్లో మరోసారి ఖైదీ జ్ఞాపకాలను గుర్తుచేశాయి. ఈ సినిమాకు ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే మీకు తెలుసా.. ఈ బ్లాక్ బస్టర్ హిట చిత్రాన్ని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో.. అవును.. మొదట ఈసినిమా కథను సూపర్ స్టార్ కృష్ణ కోసం అనుకున్నారట. కానీ ఆయన చేయలేకపోవడంతో ఆ అవకాశం చిరు వరకు వచ్చింది. ఈ చిత్రానికి ముందుగా డెరెక్టర్ రాఘవేంద్రరావు పేరు పరిశీలించగా.. చివరకు డైరెక్టర్ కోదండరామిరెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి కథ, డైలాగ్స్ అన్నింటిని చిరు బాడీ లాంగ్వేజ్ కు అచ్చుగుద్దినట్లు అందించారు పరిచూరి బ్రదర్స్.

ఈ చిత్రాన్ని 1982లో వచ్చిన రాంబో సిరీస్ మొదటి భాగంగా వచ్చిన హాలీవుడ్ క్లాసిక్ మూవీ ఫస్ట్ బ్లడ్ ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాకు ఇప్పటికీ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. కేవలం 25 లక్షలతో నిర్మించిన ఈ సినిమా మొత్తం 70 లక్షలు వసూలు చేసింది. ఈ చిత్రానికి రూ.1.75 లక్షల పారితోషికం తీసుకున్నారు. 20 కేంద్రాల్లో దాదాపు 100 రోజులు.. 5 కేంద్రాల్లో 200 రోజులు, 2 కేంద్రాల్లో 365 రోజులు ప్రదర్శించారు. ఈ సినిమా 100 రోజుల వేడుకకు సూపర్ స్టార్ కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై చిరును అభినందించారు.

ఇవి కూడా చదవండి : Actress : నాగార్జున, రజినీకాంత్‏తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?

అందానికి అమ్మ చెప్పిందే చేస్తా! హైదరాబాద్ బ్యూటీ చెప్పిన సీక్రెట్
అందానికి అమ్మ చెప్పిందే చేస్తా! హైదరాబాద్ బ్యూటీ చెప్పిన సీక్రెట్
శివరాత్రి నాడు అరుదైన మహా లక్ష్మీ రాజయోగం.. ఇలా చేస్తే డబుల్ జాక్
శివరాత్రి నాడు అరుదైన మహా లక్ష్మీ రాజయోగం.. ఇలా చేస్తే డబుల్ జాక్
కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన బిగ్ బాస్ సోనియా.. వీడియో ఇదిగో
కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన బిగ్ బాస్ సోనియా.. వీడియో ఇదిగో
పాత ఇంటిని లగ్జరీ విల్లాగా మార్చేసిన స్టార్ హీరో భార్య..
పాత ఇంటిని లగ్జరీ విల్లాగా మార్చేసిన స్టార్ హీరో భార్య..
నాగ్‌తో సినిమా ఆఫర్‌కు నో చెప్పింది.. ఈ భామ ఎవరో తెలుసా.?
నాగ్‌తో సినిమా ఆఫర్‌కు నో చెప్పింది.. ఈ భామ ఎవరో తెలుసా.?
సంజూ చేసిందేం లేదు..వాడి కంటే వీడే బెటర్ చీఫ్ సెలెక్టర్ కామెంట్స్
సంజూ చేసిందేం లేదు..వాడి కంటే వీడే బెటర్ చీఫ్ సెలెక్టర్ కామెంట్స్
జాహ్నవి కందుల కుటుంబానికి పరిహారం ఇచ్చేందుకు సియాటెల్ ఒప్పందం
జాహ్నవి కందుల కుటుంబానికి పరిహారం ఇచ్చేందుకు సియాటెల్ ఒప్పందం
ప్రేమ - పెళ్లి చేయలేదని దారుణం..!
ప్రేమ - పెళ్లి చేయలేదని దారుణం..!
మనం చేసే తప్పులతోనే లివర్ ఇన్ఫెక్షన్.. లైట్ తీసుకున్నారో..
మనం చేసే తప్పులతోనే లివర్ ఇన్ఫెక్షన్.. లైట్ తీసుకున్నారో..
ప్యాకెట్‌ పాలు vs లూజ్ పాలు.. ఏది సురక్షితం?
ప్యాకెట్‌ పాలు vs లూజ్ పాలు.. ఏది సురక్షితం?