Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2018 Movie: ఆస్కార్ రేసు నుంచి ‘2018’ మూవీ ఔట్.. ఏ సినిమాకు ఛాన్స్ వచ్చిందంటే..

96వ ఆస్కార్ అవార్డుల ప్రకటనకు నెల రోజుల ముందు, నిర్వాహకులు నిన్న 10 విభాగాల్లో నామినేషన్లను విడుదల చేశారు. అయితే ఇందులో మలయాళీ సూపర్ హిట్ చిత్రం '2018' ఉత్తమ అంతర్జాతీయ చిత్రం కేటగిరీలో ఎంపికైంది. అయితే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రకటించిన 15 సినిమాల షార్ట్ లిస్ట్ లో 2018 సినిమా ఎంపిక లేదు. ఇదే విషయాన్ని ఆ సినిమా డైరెక్టర్ జూడ్ ఆంథోని జోసెఫ్ తన ఇన్ స్టా ద్వారా తెలిపారు.

2018 Movie: ఆస్కార్ రేసు నుంచి '2018' మూవీ ఔట్.. ఏ సినిమాకు ఛాన్స్ వచ్చిందంటే..
2018 Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 22, 2023 | 1:59 PM

ఆస్కార్ 2024 అవార్డ్స్ కోసం పోటీ చేయడానికి చివరి షార్ట్ లిస్ట్ నుంచి భారతదేశ అధికారిక ఎంట్రీ ముగిసింది. 96వ ఆస్కార్ అవార్డుల ప్రకటనకు నెల రోజుల ముందు, నిర్వాహకులు నిన్న 10 విభాగాల్లో నామినేషన్లను విడుదల చేశారు. అయితే ఇందులో మలయాళీ సూపర్ హిట్ చిత్రం ‘2018’ ఉత్తమ అంతర్జాతీయ చిత్రం కేటగిరీలో ఎంపికైంది. అయితే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రకటించిన 15 సినిమాల షార్ట్ లిస్ట్ లో 2018 సినిమా ఎంపిక లేదు. ఇదే విషయాన్ని ఆ సినిమా డైరెక్టర్ జూడ్ ఆంథోని జోసెఫ్ తన ఇన్ స్టా ద్వారా తెలిపారు. ఇందులో ‘టు కిల్ ఎ టైగర్’ సినిమా బెస్ట్ డాక్యుమెంటరీ కేటగిరీలో చోటు దక్కించుకుంది. ఈ సినిమాను జార్ఖండ్ గ్యాంగ్ రేప్ ఆధారంగా రూపొందించారు. టొరంటో ఫిల్మ్ మేకర్ నిషా పహుజా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

మొత్తం 15 చిత్రాలలో అమెరికాట్సీ (అర్మేనియా), ది మాంక్ అండ్ ది గన్ (భూటాన్), ఫాలెన్ లీవ్స్ (ఫిన్లాండ్), ది టీచర్స్ లాంజ్ (జర్మనీ), ది టేస్ట్ ఆఫ్ థింగ్స్ (ఫ్రాన్స్), గాడ్‌ల్యాండ్ (ఐస్‌లాండ్), ది మదర్ ఆఫ్ ఆల్ లైస్ (మొరాకో) ఉన్నాయి. 96వ అకాడమీ అవార్డుల ప్రకటనకు నెల రోజుల ముందు నిర్వాహకులు 10 విభాగాల్లో నామినేషన్లను విడుదల చేశారు. 10 విభాగాలలో షార్ట్‌లిస్ట్ చేయబడింది. డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్, డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్, ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్, మేకప్, హెయిర్ స్టైలింగ్, మ్యూజిక్ (ఒరిజినల్ స్కోర్), మ్యూజిక్ (ఒరిజినల్ సాంగ్), యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్, లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్, సౌండ్, విజువల్ ఎఫెక్ట్స్.

96వ అకాడమీ అవార్డుల నామినేషన్లు జనవరి 23, 2024న ప్రకటిస్తారు. ఇదిలా ఉండగా, ఆస్కార్ వేడుకలు ఆదివారం, మార్చి 10, 2024న జరగనున్నాయి. ఓవేషన్ హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో జరగనున్న ఈ వేడుకను ప్రపంచవ్యాప్తంగా 200కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.