70 ఏళ్ల హీరో, 35ఏళ్ల హీరోయిన్స్.. కట్ చేస్తే సినిమా 650 కోట్లు వసూల్ చేసింది..

సినిమా ఇండస్ట్రీలో వాయసుతో సంబంధం లేకుండా చాలా మంచి హీరో, హీరోయిన్స్ కలిసి నటిస్తున్నారు. పెద్ద హీరోలతో కలిసి నటించిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అలాగే కొంతమంది తమకన్నా చిన్న హీరోలతో కూడా నటించారు. అయితే 70ఏళ్ల హీరోతో, 35ఏళ్ల హీరోయిన్ నటించి సంచలన విజయాన్ని అందుకుంది.

70 ఏళ్ల హీరో, 35ఏళ్ల హీరోయిన్స్.. కట్ చేస్తే సినిమా 650 కోట్లు వసూల్ చేసింది..
Movie

Updated on: Aug 28, 2026 | 6:19 PM

ఇండస్ట్రీలో చాలా సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. కొన్ని సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే సినిమాలో చాలా మంది హీరోయిన్స్ తమకన్నా వయసులో పెద్ద వారితో నటించారు. అలాగే తమకన్నా చిన్న వారితో కూడా కలిసి నటించారు. అయితే  70 ఏళ్ల హీరో సరసన 35 ఏళ్ల హీరోయిన్ నటించిన ఈ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకుంది. ఇంతకీ ఆ నటుడు ఎవరో తెలుసా.. ? సూపర్ స్టార్ రజినీకాంత్. ఇప్పటివరకు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. హీరోగా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో మెప్పిస్తున్నారు. జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రజినీ.. రీసెంట్ గా కూలీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ఆయన లేకపోతే నేను ఇప్పుడు ఇలా ఉండేదాన్ని కాదు.. నన్ను స్టార్ హీరోయిన్‌ను చేశారు

అయితే  ఒక దశాబ్దం క్రితం రజినీ నటించిన ఓ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా విడుదలకు ముందే టీజర్, ట్రైలర్ వార్తలలో నిలిచాయి. అదే కబాలి. 2016లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో రికార్డ్స్ బద్దలుకొట్టింది. ఇందులో రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించారు. నిజ జీవితంలో రజినీ చాలా సింపుల్‌గా ఉంటాడు. 2016లో వచ్చిన ‘కబాలి’ చిత్రంలో ఆయన నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. తన కెరీర్‌లో రజనీకాంత్ తన సహజమైన తెల్లటి గడ్డంతో తెరపై కనిపించిన చిత్రం కబాలి. 90లలో చాలా కాలం విరామం తర్వాత రజినీ తన నిజమైన లుక్‌లో తెరపై కనిపించిన మొదటి చిత్రం ఇదే కావడం విశేషం.

మహేష్‌తో ఉన్న ఈ చిన్నోడు.. ఇప్పుడు అమ్మాయిల డ్రీమ్ బాయ్.! రీసెంట్‌గానే హిట్ కొట్టాడు

2016 లో విడుదలైన రజనీకాంత్ ‘కబాలి’ అత్యధికంగా లైక్ చేయబడిన భారతీయ చిత్రాలలో ఒకటి. IMDb నివేదిక ప్రకారం, కబాలి టీజర్ యూట్యూబ్ లో రెండు గంటల్లో 1 మిలియన్ వ్యూస్, 1 లక్ష లైక్స్ పొందిన రికార్డును సృష్టించింది. 15 జూలై 2016 నాటికి, ఫేస్‌బుక్‌లో ప్రపంచవ్యాప్తంగా 4 సార్లు ట్రెండ్ అయిన ఏకైక భారతీయ చిత్రం ఇదే. 100 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ‘కబాలి’ బాక్సాఫీస్ వద్ద 650 కోట్లు వసూలు చేసింది. భారతదేశంతో పాటు అమెరికా, నార్వే, యుఎఇ, మలేషియా, ఆస్ట్రేలియాలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. కబాలి ప్రపంచవ్యాప్తంగా 8000-10000 స్క్రీన్లలో విడుదలైంది.

ఇవి కూడా చదవండి

చిరంజీవి ఇష్టమైన బాలయ్య సినిమా ఎదో తెలుసా.? ఇండస్ట్రీని షేక్ చేసిన మూవీ అది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us