20 years of Mahesh Babu’s Murari : 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న మహేష్ బాబు క్లాసిక్ సూపర్ హిట్ ‘మురారి’
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో రాజకుమారుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ నటుడిగా మహేష్ ను ప్రేక్షకులకు దగ్గర చేసిన సినిమా మురారి.
20 years of Mahesh Babu’s Murari : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో రాజకుమారుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ నటుడిగా మహేష్ ను ప్రేక్షకులకు దగ్గర చేసిన సినిమా మురారి. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ క్లాసిక్ సూపర్ హిట్ విడుదలై 20 ఏళ్ళు పూర్తయ్యింది. ఈ సినిమా టీవీలో టెలికాస్ట్ అవుతుందంటే ప్రేక్షకులను కన్నార్పకుండా చూస్తున్నారంటే ఆ సినిమా ఎంతలా ప్రేక్షకులను అలరిస్తుందో అర్ధమవుతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో మణిశర్మ అందించిన పాటలు ఎవర్గ్రీన్ హిట్ అయ్యాయి.
మహేష్ సరసన సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించింది. హీరో హీరోయిన్ ల మధ్య లవ్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ‘మురారి’. 2001 ఫిబ్రవరి 17న ఈ చిత్రం విడుదలయింది. ఈ యేడాది ఫిబ్రవరి 17తో ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. ఈ మూవీలో కృష్ణవంశీ మార్క్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ‘మురారి’లో కృష్ణవంశీ పాటలను తెరకెక్కించిన తీరు జనాన్ని విశేషంగా ఆకట్టుకుంది. ‘ వేటూరి , సీతారామశాస్త్రి, చంద్రబోస్, సుద్దాల అశోక్ తేజ రాసిన పాటలు శ్రోతలను అలరించాయి. ముఖ్యంగా ‘అలనాటి రామచంద్రుడి..’ పాట ఇప్పటికీ పెళ్లి వేడుకల్లో మార్మోగుతూనే ఉంటుంది. ఈ సినిమా తరవాత మహేష్ కు లేడీ ఫ్యాన్స్ విపరీతంగా పెరిగారు. 23 కేంద్రాలలో ఈ చిత్రం శతదినోత్సవం జరుపుకుంది.మహేశ్ బాబు కెరీర్ లో తొలి సిల్వర్ జూబ్లీ సినిమాగా నిలచింది ‘మురారి’. ఇక మురారి 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు సందడి చేసితున్నారు. మురారి సినిమా పోస్టర్ లను వీడియో పాటలను షేర్ చేస్తూ హంగామా సృష్టిస్తున్నారు. ఇక మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమానుంచి అప్డేట్ ఇవ్వనున్నారు చిత్రయూనిట్.
మరిన్ని ఇక్కడ చదవండి :
Krish- Vaishnav Tej film: మెగా హీరో రెండో సినిమాపై భారీ అంచనాలు.. బిజినెస్ కూడా బాగానే…